ETV Bharat / city

TELANGANA TOP NEWS: టాప్​న్యూస్@3PM - తెలంగాణ వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TELANGANA TOP NEWS
TELANGANA TOP NEWS
author img

By

Published : Sep 14, 2022, 2:58 PM IST

  • 210 నిమిషాలు ఆగిపోయిన గుండె.. వైద్యుల అరుదైన సర్జరీ.. చివరకు..!

మేరఠ్​లో ఓ మహిళ గుండె దాదాపు 210 నిమిషాలపాటు ఆగిపోయింది. అయినా ఆమెను వైద్యులు కాపాడారు. ఇదేలా సాధ్యం అని అంటారా? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే....

  • అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్టు

పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.50 కోట్ల రుణం తీసుకుని ఎగవేసిన కేసులో అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త రామకోటేశ్వరరావులను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. దంపతులిద్దరికి సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది. నిన్న రాత్రి నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు ఇవాళ అరెస్టు చేశారు.

  • అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ముగ్గురు మృతి

జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గత నెలలో అప్పుల బాధ తట్టుకోలేక పురుగుల మందు తాగిన కుటుంబంలో ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు. తల్లి శైలజ పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

  • పార్లమెంట్‌కు అంబేడ్కర్ పేరు.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన బండి సంజయ్

దిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలనే ప్రతిపాదనను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల బండిని కలిసిన ప్రజా గాయకుడుగద్దర్ ఈ విజ్ఞప్తిని చేయగా.. గద్దర్ వినతిని బండి కేంద్రానికి పంపించారు.

  • ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు...

నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో మోదీని ప్రశ్నిస్తూ గోడలపై పోస్టర్​లు దర్శనం ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసలు ఎందుకిలా ప్రశ్నించాల్సి వచ్చింది.. ఇంతకీ ఏమిటా ప్రశ్నలు? చూద్దామా..

  • గోవా కాంగ్రెస్​కు షాక్.. కాషాయ పార్టీలోకి 8 మంది ఎమ్మెల్యేలు

కాంగ్రెస్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గోవా అసెంబ్లీలో కాంగ్రెస్​కు ఉన్న 11 మంది సభ్యుల్లో.. 8 మంది భాజపాలో చేరారు. సీఎం ప్రమోద్ సావంత్ సమక్షంలో వారు కాషాయ కండువా కప్పుకున్నారు.

  • ఏడో అంతస్తు నుంచి పడిన లిఫ్ట్- 8 మంది కూలీలు దుర్మరణం

గుజరాత్ అహ్మదాబాద్​లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్​ యూనివర్సిటీకి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఆస్పైర్-2​ భవనంలో లిఫ్ట్ కూలడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది. బుధవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

  • ఉద్యోగం పేరుతో 'ఆమె'ను వ్యభిచార ఊబిలోకి నెట్టిన అంకుల్​..

మైనర్​కు ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకెళ్లి వ్యభిచారం చేయించాడు ఆమె మేనమామ. బాలికకు సంబంధించిన ఓ అశ్లీల వీడియో వైరల్​ కావడం వల్ల ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. మరోవైపు, పట్టపగలే నడిరోడ్డుపై ఓ యువకుడ్ని గొంతునులిమి చంపేశాడు దుండగుడు. మధ్యప్రదేశ్​లో జరిగిందీ ఘటన.

  • కృష్ణంరాజు 'మా' ప్లాన్​.. ఆయన మంచు విష్ణుతో అలా చేయించారా?

కృష్ణంరాజు తుదిశ్వాస విడవడం చాలా బాధకరమైన విషయమని మంచు విష్ణు భావోద్వేగం అయ్యారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

  • 4 ఓవర్లలో 2 మెయిడెన్లు.. 3 పరుగులిచ్చి 4 వికెట్లు.. బ్యాటర్లకు చుక్కలే

రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ 2022లో భాగంగా ఇంగ్లాండ్​ లెజెండ్స్​తో జరిగిన మ్యాచ్​లో సనత్‌ జయసూర్య.. తన స్పిన్ మాయజాలంతో అదరగొట్టేశాడు. బ్యాటర్లకు చుక్కలు చూపించేశాడు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్​లో శ్రీలంక విజయం సాధించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.