ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్ @7AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS IN TELANGANA TODAY
TOP NEWS IN TELANGANA TODAY
author img

By

Published : Sep 9, 2022, 7:03 AM IST

  • బ్రిటన్‌ మహారాణి ఎలిజబెత్‌-2 కన్నుమూత

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 (96) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. అంతకుముందు రాణి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న సమాచారంతో కుటుంబ సభ్యులంతా స్కాట్లాండ్‌లోని ఆమె నివాసానికి చేరుకున్నారు.

  • ఖైరతాబాద్​ వినాయకుడి నిమజ్జనానికి చకచకా ఏర్పాట్లు

ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లో ఉన్న తెలుగువారంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది భక్తులు నిమజ్జన వేడుకను చూసి తరిస్తారు. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.

  • గవర్నర్‌ రాజ్‌భవన్‌ను రాజకీయ వేదికగా చూస్తున్నారు

గవర్నర్‌ తమిళసై ఇవాళ రాజ్​భవన్​లో చేసిన వ్యాఖ్యలపై గులాబీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ కవిత కూడా ట్విటర్ వేదికగా తన గవర్నర్ వ్యాఖ్యలను ఖండించారు. గవర్నర్ రాజ్​భవన్​ను రాజకీయ వేదికగా మార్చాలని చూస్తున్నారని ఆరోపించారు.

  • ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన.. వైరల్‌ ఫీవర్‌తో ?

సీ సెక్షన్‌ ఆపరేషన్‌ చేయించుకున్న మహిళ చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని మోడరన్‌ గవర్నమెంట్‌ మెటర్నిటీ ఆస్పత్రిలో జరిగింది. ఈమె వైరల్‌ ఇన్‌స్పెక్షన్‌తో మరణించినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

  • బెంగళూరు హోటళ్లలో రూమ్‌ ధర రూ. 40వేలు

కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బెంగళూరు సహా పలు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. చాలా ప్రాంతాల ప్రజలు హోటళ్లలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతున్నాయి.

  • పాక్​కు అమెరికా యుద్ధ విమానాలు

పాకిస్థాన్​కు 450 మిలియన్ల డాలర్ల సహాయం అందించేందుకు బైడెన్ సర్కారు ముందుకు వచ్చింది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఎఫ్‌-16 ఫైటర్ జెట్లను పాక్​కు అందించనుంది అమెరికా.

  • భువీ సంచలన బౌలింగ్​.. కోహ్లీ రికార్డు సెంచరీ.. అఫ్గాన్​ చిత్తు

ఆసియా కప్‌లో టీమ్‌ఇండియా.. విజయంతో ప్రయాణం ముగించింది. ఇప్పటికే ఫైనల్‌ అవకాశాలు కోల్పోయిన భారత్​.. నామమాత్రమైన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భువీ 4 ఓవర్లలో 4 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు.

  • నీరజ్‌ చోప్రా నయా చరిత్ర

భారత స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా మరోసారి చరిత్ర సృష్టించాడు. డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన భారత తొలి అథ్లెట్‌గా రికార్డు సాధించాడు.

  • కొత్త సినిమాల ట్రైలర్లు వచ్చేశాయి.. మీరు చూశారా?

టాలీవుడ్​ యువ నటుడు కిరణ్​ అబ్బవరం నటించిన 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' ట్రైలర్​ను చిత్ర యూనిట్​ విడుదల చేసింది. బాలీవుడ్​ 'విక్రం వేద' టైలర్​ విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది. నాగశౌర్య కొత్త చిత్రం 'కృష్ణ వ్రింద విహారి' ట్రైలర్​ కూడా విడుదలైంది.

  • ఒక్క ఫొటోతో రెండు సినిమాల అప్డేట్స్ ఇచ్చిన తమన్

స్టార్​ మ్యూజిక్​ డైరెక్టర్​ తమన్​.. ఒక్క ఫొటోను షేర్​ చేస్తూ రెండు సినీ అప్డేట్స్​ ఇచ్చారు. ప్రస్తుతం తమన్​ చేసిన ఆ పోస్ట్​ సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఇంతకీ ఆయన ఇచ్చిన ఆ రెండు అప్డేట్స్ ఏంటంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.