ETV Bharat / city

Telangana News Today టాప్​న్యూస్ 9AM - తెలంగాణ తాజా వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today
author img

By

Published : Aug 23, 2022, 9:00 AM IST

  • కౌంటర్ల దాఖలులో ఇంత నిర్లక్ష్యమా

Telangana HC on GO 111 జీవో 111 విషయంలో ప్రభుత్వంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కౌంటర్​ దాఖలు చేయకపోవడాన్ని తప్పుపట్టింది. ఈ పిటిషన్​ దాఖలై 15 ఏళ్లు గడుస్తున్న ఇంకా ఈ ఆలస్యం ఏంటి అని ప్రశ్నించింది. చివరిగా ఈ ఒక్కసారికి గడువు ఇస్తున్నామంటూ విచారణను వాయిదా వేసింది.

  • పాలమూరుపై పిటిషన్‌ వేరే ధర్మాసనానికి బదిలీ

Palamuru Rangareddy Lift Irrigation Scheme పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై దాఖలైన పిటిషన్‌ను వేరే ధర్మాసనానికి బదిలీ చేస్తూ సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేసి విచారణ జాబితాలో చేర్చాలని సీజేఐ రిజిస్ట్రీని ఆదేశాలు జారీ చేశారు.

  • కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికకు సన్నాహాలు

Congress President Election కాంగ్రెస్‌ నూతన అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ మూడు, నాలుగు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉందని పార్టీ​ వర్గాలు తెలిపాయి. సెప్టెంబరు 20వ తేదీ కల్లా కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేలా షెడ్యూల్‌ను రూపొందించినట్లు పేర్కొన్నాయి. మరోవైపు కాంగ్రెస్​ అధ్యక్ష బాధ్యతలను రాహుల్​ నిరాకరిస్తే దేశవ్యాప్తంగా కార్యకర్తలు నిరాశకు లోనవుతారని రాజస్థాన్​ సీఎం అన్నారు.

  • నిరసన చేస్తున్న విద్యార్థిని చావబాదిన అదనపు జిల్లా మేజిస్ట్రేట్​

Patna ADM Brutally Thrashes ఉపాధ్యాయ కొలువు ఆశిస్తున్న ఓ అభ్యర్థిపై దారుణంగా ప్రవర్తించారు అదనపు జిల్లా మేజిస్ట్రేట్​. పోలీస్​ చేతిలో నుంచి లాఠీ తీసుకొని అతడిని చితకబాదాడు. బిహార్​లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి దోషులపై చర్యలు తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్​ తెలిపారు.

  • సూర్యప్రకాశ్ కుటుంబం ఆత్మహత్య కేసులో వెలుగులోకి విస్తుపోయే విషయాలు

Nizamabad Family Suicide Case రియల్టర్ సూర్యప్రకాశ్ కుటుంబం బలవన్మరణ ఘటనలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. నిజామాబాద్​లోని ఓ హోటల్​లో ఆదివారం సూర్యప్రకాశ్, భార్య, పిల్లలు సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఆ విషయాలేంటో మీరే చూడండి.

  • అయిదు సార్లు చంపడానికి ట్రై చేసి, ఆరోసారి అంతమొందించారు

Singareni worker murder case వివాహమై ఆరెళ్లయింది. ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఆమె తన చిన్ననాటి స్నేహితునితో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఈ క్రమంలో తన భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. ఆరుసార్లు చంపేందుకు ప్రయత్నించారు. మొత్తానికి ఈ నెల 19న మట్టుబెట్టారు.

  • రాష్ట్రంలో వేగంగా ఉద్యోగ ప్రకటనల జారీకి టీఎస్‌పీఎస్సీ కసరత్తు

Government Jobs in Telangana రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు జారీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ విభాగాల నుంచి అందిన ప్రతిపాదనల్లోని లోపాలు సరిదిద్ది, వీలైనంత త్వరగా ప్రకటనలు జారీ చేయాలని భావిస్తోంది. ఇంజినీరింగ్‌, స్పెషలైజేషన్‌ ఉద్యోగాలతో పాటు ఇప్పటికే అనుమతించిన వాటిల్లో గ్రూప్‌3 కొలువులను గుర్తిస్తోంది. ఇకనుంచి వరుసగా ఉద్యోగ ప్రకటనలు ఉండేలా కసరత్తు చేస్తోంది.

  • భారతీయ విద్యార్థులకు వీసాలపై చైనా కీలక ప్రకటన

China announces Visa For Indian కరోనా నేపథ్యంలో వీసా ఆంక్షల కారణంగా స్వదేశంలో చిక్కుకుపోయిన వందల మంది భారత విద్యార్థులను తిరిగి చైనాలోని విద్యాసంస్థల్లోకి అనుమతించే విషయంలో కొంత ముందడుగు పడింది. వారంతా తిరిగి చైనాకు వెళ్లేందుకు వీలుగా త్వరలోనే వీసాలు జారీ చేయనున్నట్లు చైనా ప్రకటించింది.

  • ప్రపంచ ఛాంపియన్లకే షాకిస్తున్న ప్రజ్ఞానంద

ప్రపంచంలోని మహామహా ఆటగాళ్లు కార్ల్‌సన్‌పై గెలిచేందుకు విఫలప్రయత్నాలు చేస్తుంటే టీనేజీ సంచలనం ప్రజ్ఞానంద మాత్రం అతడిపై ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాడు. క్షణాల్లో ప్రత్యర్థి గేమ్‌ను చదివేసి, ఊహకు అందని ఎత్తులతో జయకేతనం ఎగురవేసే కార్ల్‌సన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. అయితే ప్రపంచ ఛాంపియన్​కే భారీ షాకిచ్చిన ప్రజ్ఞానంద చెస్​ వైపు ఆకర్షితుడయ్యాడో తెలుసా.

  • హీరో కార్తీక్​ ఆర్యన్​తో రష్మిక రొమాన్స్​, విలన్​గా నాగబాబు

పుష్ప సినిమాతో విపరీతమైన క్రేజ్​ సంపాదించుకున్న హీరోయిన్​ రష్మిక త్వరలోనే హీరో కార్తీక్​ ఆర్యన్​ సరసన కొత్త ప్రాజెక్ట్​కు సంతకం చేసినట్టు సమాచారం. మరోవైపు, శరణ్‌ కుమార్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సాక్షి సినిమాలో మెగా బ్రదర్​ నాగబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.