ETV Bharat / city

9AM టాప్​న్యూస్

author img

By

Published : Aug 13, 2022, 8:58 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

9AM TOPNEWS
9AM TOPNEWS

  • పురుగుల మందుతో మతిస్థిమితం లేని మహిళ వంట ఆతర్వాత ఏమైదంటే

ఆ మహిళకు మతిస్థిమితం సరిగ్గా లేదు. ఆమె వంట చేసేందుకు పురుగుల మందునే మంచినూనెగా భావించి దానితో కూరను వండింది. ఆ కూరను తాను తినటమే కాక భర్తకు కుమార్తెకు సైతం వడ్డించింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

  • రాష్ట్రంలో తొలుత 3.3 లక్షల కొత్త పింఛన్లు

రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరులో తొలుత మూడున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు ప్రాధాన్యం లభించనుంది. కొత్తగా 10 లక్షల పింఛన్ల మంజూరుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన నేపథ్యంలో.. పెండింగ్‌లోని 3.3 లక్షల మందికి వెంటనే పింఛను మంజూరుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

  • మన్యంలో మత్తు యువత జీవితాలు చిత్తు

ఒకప్పుడు నగరాలకే పరిమితమైన గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం ఇప్పుడు ఏజెన్సీ గ్రామాలకు విస్తరిస్తోంది. తద్వారా యువత మత్తుకు బానిసే బానిసై భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. మాదక ద్రవ్యాల నిరోధక, ఎక్సైజ్‌ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

  • భవిష్యత్తు గృహాలు ఎలా ఉండబోతున్నాయి

ఇళ్ల నిర్మాణంలో 75 ఏళ్లలో చాలా మార్పులు వచ్చాయి. రాబోయే పాతికేళ్లలో ఇప్పటిలాగా ఇళ్లు కొనకుండానే సొంతం చేసుకోవచ్చు. కొందరేమో ఐదారేళ్లకు ఒక సొంతిల్లు మారుస్తున్నారు.

  • ఆగస్టు 15న స్వాతంత్య్రం.. 17న విభజన!

పాకిస్థాన్‌కు 1947 ఆగస్టు 14న, భారత్‌కు ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చేసింది. మరి విభజన ఎప్పుడు జరిగింది? ఆగస్టు 17న. అంటే.. విడిపోకుండానే భారత్‌, పాక్‌ ఏర్పడ్డాయి. ఆవిర్భావం తర్వాత విభజన జరిగింది. దాని వెనక పెద్ద కథే నడిచింది.

  • పరిఢవిల్లిన పరిశోధన.. భవిష్యత్‌ టెక్నాలజీల దిశగా భారత్‌ పరుగులు

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎన్నో మైలురాళ్లను సాధించిన భారత్​.. జన జీవితాల్లో విజ్ఞానపు వెలుగులు విరజిమ్ముతోంది. భవిష్యత్‌ టెక్నాలజీల దిశగా భారత్‌ పరుగులు పెడుతోంది. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రానున్న 25 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాలపై ప్రత్యేక కథనం..

  • 'అప్పటి నుంచి ఆయన నా ఫోన్‌ కాల్స్‌కు స్పందించడం లేదు'

బ్రిటన్​ ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్​.. మాజీ ప్రధానమంత్రి బోరిస్​ జాన్సన్​పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజీనామా చేసినప్పటినుంచి జాన్సన్‌ తన మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌కు స్పందించడం లేదని రిషి వెల్లడించారు.

  • జుట్టు రాలిపోతుందా? ఇలా ట్రై చేసి చూడండి

జుట్టు రాలిపోవడం అనేది ఈ మధ్య అంతా ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్య. వయసుతో సంబంధం లేకుండా ఎంతోమందిని ఈ సమస్య వేధిస్తోంది. ఈ క్రమంలో దీనిని పరిష్కరించగలిగే కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం రండి.

  • చరిత్ర సృష్టించిన తెలంగాణ రెజ్లర్​ నిఖిల్‌

కుస్తీ అంటే అతడికి ఇష్టం. అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటాలని కలగన్నాడు. సాధించలేకపోయాడు. ఆర్థిక ఇబ్బందులు అతడి కలలకు బ్రేకులేశాయి. కానీ.. తన కొడుక్కి మాత్రం కాదు.

  • ఉత్కంఠగా 'కార్తికేయ 2'.. ఫ్యాన్స్​కు విజువల్​ ట్రీట్​!

నిఖిల్​ నటించిన తాజా చిత్రం 'కార్తికేయ 2' నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. సోషల్​మీడియాలో పాజిటివ్​ రెస్పాన్స్​ వస్తోంది. ఈ నేపథ్యంలో మూవీటీమ్​ తాజాగా విడుదల చేసిన మేకింగ్ విజువల్స్​ను ఓ సారి చూసేద్దాం. ఈ విజువల్స్​ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.