ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్ @ 7AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today : టాప్​న్యూస్ @ 7AM
Telangana News Today : టాప్​న్యూస్ @ 7AM
author img

By

Published : Jul 10, 2022, 7:07 AM IST

  • నేడు, రేపు అతి భారీ వర్షాలు..

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో గత పదేళ్లలో జులై నెల ఒకరోజులో (24 గంటలు) నమోదైన అత్యధిక వర్షపాతమిదే అని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరటం వల్ల అక్కడి ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు.

  • పర్వదినాలకు ఆరంభం ఈ "ఏకాదశి"..!

Ekadashi Festival Importance: ఆషాఢ శుద్ధ ఏకాదశి- తొలి ఏకాదశి. హైందవులకు ఇది మహా పర్వదినం. దీన్ని "హరివాసరం" అని.. "శయనైకాదశి" అని పిలుస్తారు. తొలి ఏకాదశి నుంచే సనాతన సంప్రదాయంలో పండుగలు, పర్వదినాల సమాహారం ఆరంభమవుతుంది. ఎన్నో విశేషాల ఆధ్యాత్మిక ప్రక్రియల రాశి- తొలి ఏకాదశి.. మరీ ఆ ఏకాదశి ప్రాశస్త్యమేంటో తెలుసుకుందాం.. రండి..

  • చిన్న వానకే వణుకు..

వర్షం వచ్చిందంటే చాలు పట్టణాల్లోని పలు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. వాన, మురుగు నీరు కలుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన కాలువలు లేకపోవడం.. నిర్మాణ పనుల్లో జాప్యం ఈ దుస్థితికి ప్రధాన కారణం.

  • కరెంటు సమస్యల కోసం ఈ నెంబర్లకు కాల్​ చేయండి..

Electricity Department Helpline: రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో ఎస్పీడీసీఎల్​ సీఎండీ రఘుమారెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి సిబ్బందికి నిత్యం అందుబాటులో ఉండాలని సూపరింటెండెంట్​ ఇంజినీర్లను ఆదేశించారు. విద్యుత్​కు సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉన్నా విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ నెంబర్లను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.

  • ఏపీలోనూ భారీ వర్షాలు..

Rains: నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ అత్యంత క్రియాశీలకంగా మారినట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఒడిశా-కోస్తాంధ్ర తీరం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు ఐఎండీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏపీలో అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు.

  • బ్రిటిష్‌ జగన్నాటకం..

భారత్‌లోని సంపదను అన్ని విధాలుగా దోచుకున్న ఆంగ్లేయులు... దేవాలయాలపైనా కన్నేశారు. ఇందులో భాగంగా పూరీ జగన్నాథ దేవాలయంపైనా ఆధిపత్యం చలాయించజూశారు. కానీ... గజపతి రాణి, ఓ న్యాయవాది కలసి తెల్లవారి జగన్నాటకానికి తెరదించారు.

  • అవిభక్త కవలలకు.. అరుదైన శస్త్రచికిత్స సక్సెస్​!

బంగాల్​లోని ఓ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఒకే కాలేయంతో ఉదరభాగం అతుక్కుని పుట్టిన కవలలకు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి విడదీశారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలోనే డిశ్చార్జ్​ చేస్తామని డాక్టర్లు తెలిపారు.

  • బంగారం ఇప్పుడు కొనొచ్చా?.

బంగారం, వెండి ధరల్లో గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల్లో గందరగోళం నెలకొంది. పసిడి కొనుగోలుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారు? ఈ పరిస్థితుల్లో బంగారం కొనొచ్చా?

  • మరో సిరీస్​ భారత్​ కైవసం..

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. 49 రన్స్​ తేడాతో గెలుపొందింది. దీంతో సిరీస్​ను టీమ్​ ఇండియా కైవసం చేసుకుంది. ఈ విజయంతో రోహిత్ శర్మ కెప్టెన్సీలో నాలుగో సిరీస్ గెలుచుకుంది టీమ్​ఇండియా. 17 ఓవర్లలో 121 పరుగులకు ఇంగ్లాండ్​ను భారత్​ ఆల్ అవుట్ చేసింది.

  • 'రా రా రెడ్డి.. ఐ యామ్‌ రెడీ'..

నితిన్‌ కథానాయకుడిగా ఎమ్‌.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. అయితే ఈ సినిమాలోని 'రా రా రెడ్డి.. ఐ యామ్‌ రెడీ' అంటూ సాగే ప్రత్యేక గీతం లిరికల్‌ సాంగ్‌ను శనివారం విడుదల చేశారు. మహతి స్వర సాగర్‌ స్వరాలు సమకూర్చిన ఈ మాస్​ బీట్​ ఆకట్టుకుంటోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.