ETV Bharat / city

Telangana Top News : టాప్‌ న్యూస్ @ 1PM - తెలంగాణ వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్‌ న్యూస్ @ 1PM
టాప్‌ న్యూస్ @ 1PM
author img

By

Published : May 16, 2022, 1:00 PM IST

  • 12 ఏళ్ల బాలికకు 35 ఏళ్ల వ్యక్తితో పెళ్లి..

వారిది నిరుపేద కుటుంబం.. కాలానికి అనుగుణంగా సంచార జీవితం గడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అలాంటి వారి జీవితంలో పుట్టినరోజులు, పెళ్లి రోజులు, సంబురాలు అంటే వారికే కాదు.. వారి కడుపున పుట్టిన పిల్లలకూ వింతే. ఏ నెల ఏ ఊళ్లో ఉంటామో తెలియని కుటుంబంలో పుట్టిన ఆ బాలికకు.. పుట్టిన రోజు అనేది తీరని కలే. అయినా అమ్మానాన్నలను గౌరవిస్తూ వారికి ప్రతి పనిలోనూ సహాయముండేది. ఇలా జరుగుతుండగా ఓ రోజు తల్లిదండ్రులు తన దగ్గరకు వచ్చి.. 'కొద్ది రోజుల్లో నీ పుట్టినరోజు.. కేక్ కట్‌ చేసి సంబురాలు చేసుకుందాం' అన్నారు. అంతే ఆ బాలిక ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే.

  • కొరియాపై కరోనా పంజా.. కిమ్ 'స్పెషల్ ఆపరేషన్'..

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి తగ్గుతున్న వేళ.. ఉత్తరకొరియాలో ఈ మహమ్మారి విరుచుకుపడుతోంది. నాలుగురోజుల వ్యవధిలోనే అక్కడ మరణాల సంఖ్య 50 దాటింది. తాజాగా కరోనా బారినపడి 8 మంది మృతిచెందగా.. ‌ప్రస్తుతం 3 లక్షల92వేల మంది జ్వరం లక్షణాలతో బాధ పడుతున్నట్లు ఉత్తర కొరియా ఎమర్జెన్సీ యాంటీ వైరస్‌ కార్యాలయం వెల్లడించింది. ప్రజలకు కరోనా ఔషధాలను పంపిణీ చేయాలని సైన్యాన్ని.. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆదేశించారు.

  • బుద్ధ భూమిలో మోదీ..

Modi Nepal Visit: బుద్ధ పూర్ణిమ సందర్భంగా నేపాల్​ పర్యటనకు వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. బుద్ధుని జన్మస్థలమైన లుంబినిలోని చారిత్రక మాయాదేవి ఆలయాన్ని సందర్శించారు. నేపాల్​ ప్రధాని షేర్ బహదుర్ దేవ్​బాతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను మోదీకి వివరించారు నిర్వాహకులు. భారత్​-నేపాల్ మధ్య స్నేహ బంధానికి సంకేతంగా దేవ్​బా ఆహ్వానం మేరకు మోదీ ఈ పర్యటనకు వెళ్లారు.

  • రాజన్న ఆలయం వద్ద శిశువు అపహరణ..

Baby Kidnap: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ ఆలయం వద్ద శిశువు అపహరణకు గురైంది. కరీంనగర్​కు చెందిన లావణ్యకు మద్యం తాగించి శిశువును ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. బాధిత మహిళ ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చేపట్టారు.

  • అకాల వర్షాలు.. తీరని కష్టాలు..

నిన్న రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు జగిత్యాల, మెదక్, నిజామాబాద్, నిర్మల్, మేడ్చల్ జిల్లాల్లో అన్నదాతలు అతలాకుతలం అయ్యారు. పలు మండలాలతో గ్రామాల్లో భారీ వర్షానికి వరిధాన్యం తడిసి ముద్దయింది., మొక్కజొన్న, సజ్జ, నువ్వు, మామిడి పంటలు నేలవాలాయి. అకాల వర్షాలతో ఏమి చేయలేని రైతులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పలు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఉండడంతో ధాన్యం కుప్పలు వరదనీటిలో మునిగిపోయాయి.

  • హైదరాబాద్‌లో కూరగాయల ధరలు ఇలా..!!

Vegetables Price in Hyderabad Today: హైదరాబాద్​ మోడల్​ రైతుబజార్​ ఎర్రగడ్డలో సోమవారం(16-05-2022) కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి.

  • దాడుల సంస్కృతి దురదృష్టకరం: చంద్రబాబు

CBN FIRE: ఏపీలోని కుప్పంలో ఎన్నడూ లేని దాడుల సంస్కృతిని వైకాపా తీసుకొచ్చిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. కుప్పంలో ఓ హోటల్‌పై వైకాపా కౌన్సిలర్ల దాడిని ఆయన ఖండించారు.

  • కొలువుల జాతర..

Jobs for Freshers: ఇంజినీరింగ్ పట్టభద్రులకు ఈ ఏడాది సువర్ణావకాశాలు లభించనున్నాయి. టీసీఎస్​, ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్​ వంటి దిగ్గజ సంస్థలు పెద్ద ఎత్తున రిక్రూట్​మెంట్​ చేపడుతున్నాయి. ఈ మూడు సంస్థల్లోనే 1.30లక్షలకుపైగా ఉద్యోగ అవకాశాలున్నాయి.

  • మా వాట్సప్‌ గ్రూప్‌నకూ ఆ పేరే పెట్టాం: కిదాంబి శ్రీకాంత్‌

Thomas cup Kidambi Srikanth: ప్రతిష్టాత్మక థామస్​ కప్​ను సొంతం చేసుకుని సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది భారత్​. పురుషుల జట్టు స్వర్ణంతో సత్తాచాటింది. మ్యాచ్​ అనంతరం బ్యాడ్మింటన్​ వరల్డ్​ ఫెడరేషన్​తో మాట్లాడిన శ్రీకాంత్​.. టోర్నీకి ముందు జరిగిన ఆసక్తికర ఘటనలను గుర్తు చేసుకున్నాడు.

  • 'ఊ అంటావా'కు రూ.5కోట్లు.. 'రోబో' పాటకు రూ. 20కోట్లు..

పాటలు లేని భారతీయ సినిమాను ఊహించడం కష్టం. కేవలం పాటలకోసం సినిమాలకు వచ్చే ప్రేక్షకులు ఉంటారనడంలో ఆశ్చర్యం లేదు. సాంగ్స్​తో హిట్​ కొట్టిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. అంత ప్రాముఖ్యత ఉన్న పాటలను తెరకెక్కించేందుకు దర్శకులు పోటీ పడుతుంటారు. విజువల్​ రిచ్​గా కనిపించేందుకు తాపత్రయపడుతుంటారు. ఇందుకోసం ఎంతఖర్చు అయినా పెట్టడానికి వెనుకాడరు. ఈ నేపథ్యంలో భారతీయ సినీ చరిత్రలో భారీ బడ్జెట్​తో తెరకెక్కిన పాటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.