ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @ 9PM - తెలంగాణ వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్ న్యూస్ @ 9PM
టాప్ న్యూస్ @ 9PM
author img

By

Published : May 29, 2022, 9:06 PM IST

  • కర్ణాటకలో ముగ్గురు తెలంగాణవాసులు మృతి

Hyderabad tourists drowned: బంధుమిత్రులంతా కలిసి వెళ్లిన విహారయాత్ర.. ముగ్గురు ప్రాణాలను బలిగొంది. అప్పటివరకు ఎంతో వినోదంగా గడిపిన వారిని.. ఒక్కసారిగా విషాదం అలుముకుంది. సరదాగా జలపాతంలో దిగిన ముగ్గురు వ్యక్తులు.. తిరిగి విగతజీవులుగానే బయటికివచ్చారు. వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపారు. ఈ విషాదం.. కర్ణాటకలోని అబ్బి జలపాతంలో చోటుచేసుకుంది.

  • నలుగురితో లైంగికదాడి చేయించి.. ఘాతుకాన్ని వీడియో తీసింది..!

ఒక చెట్టు వాడిపోకుండా ఉండాలంటే కావాల్సింది నీళ్లు.. అదే దంపతుల మధ్య విరిసిన ప్రేమ వాడిపోకుండా కలకాలం ఉండాలంటే.. కావాల్సింది నమ్మకం. అది గనకపోయి.. ఆ స్థానంలో అనుమానం అనే చీడ మొదలైందా.. సంసార వృక్షాన్ని మొత్తం నిర్వీర్యం చేసి నేలకూలుస్తుంది.

  • రూపాయి కూడా దుర్వినియోగం చేయలేదు

Central Minister Kishan Reddy: రాష్ట్రాల నుంచి వసూలు చేసిన పన్నులను మౌలిక వసతుల కల్పన, దేశ రక్షణ కోసం ఉపయోగిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రాలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో....42 శాతం పన్నులను ఇస్తున్నామని వెల్లడించారు.

  • గతంలోని పల్లెప్రగతి బిల్లులు చెల్లించండి..

Uttam Letter to CM KCR: ఐదో విడత పల్లె ప్రగతి మొదలు పెట్టక ముందే గ్రామాలకు రావాల్సిన పల్లె ప్రగతి బిల్లులను చెల్లించాలని ఎంపీ ఉత్తమ్​కుమార్​ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉత్తమ్​ లేఖ రాశారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఆ పనులు చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నారని తెలిపారు.

  • రాజ్యసభకు నిర్మల, పీయూష్​కు ఛాన్స్​

త్వరలో 9 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 16 రాజ్యసభ స్థానాలకు భాజపా అభ్యర్ధులను ప్రకటించింది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌ను కర్ణాటక నుంచి, పీయూ‌ష్​ గోయల్‌ను మహారాష్ట్ర నుంచి అభ్యర్ధులుగా ఎంపిక చేసింది.

  • పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య

పంజాబ్‌లో కాంగ్రెస్‌ నాయకుడు, ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు గురయ్యారు. మాన్సా జిల్లాలో జీపులో వెళ్తుండగా ఆయన బృందంపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సిద్ధూ మూసేవాలా మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

  • 'ఆధార్ జిరాక్స్' సూచనలపై కేంద్రం యూటర్న్

Aadhaar xerox advisory: ఆధార్ కార్డు ఫొటోకాపీ ఇతరులతో పంచుకోవడంపై చేసిన కీలక సూచనలను కేంద్రం వెనక్కి తీసుకుంది. ఆధార్ జిరాక్స్ కాపీని అవసరమైన చోట మాత్రమే సమర్పించాలని ఇదివరకు సూచించగా.. తాజాగా ఈ ప్రకటనను ఉపసంహరించుకుంది. అసలు ఏమైందంటే?

  • సరిహద్దులో పాక్​ డ్రోన్​ కూల్చివేత

Pakistan drone shot down: జమ్ముకశ్మీర్​, కథువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్థాన్​కు చెందిన ఓ డ్రోన్​ను కూల్చివేశాయి భద్రతా దళాలు. డ్రోన్​ మోసుకొచ్చిన బాక్సులో గ్రెనేడ్లు, బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

  • 'ఆ పాత్ర కోసం ఆహారం తీసుకోలేదు'

Sai Pallavi: ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయి.. తన నటనా చాతుర్యంతో మైమరిపిస్తుంది సాయి పల్లవి. పాత్ర కోసం ఆమె ఎంతో శ్రమిస్తుంది. ఈ క్రమంలోనే రానాతో కలిసి నటించిన 'విరాటపర్వం' సినిమా కోసం ఆమె ఆహారం తీసుకోకుండా ఉందని చెప్పారు దర్శకుడు వేణు ఊడుగుల.

  • ఫైనల్ పంచ్.. రాజస్థాన్ బ్యాటింగ్​

IPL 2022 Final: గుజరాత్​లోని మొతేరా స్టేడియం వేదికగా గుజరాత్​ టైటాన్స్​, రాజస్థాన్​ రాయల్స్​ మధ్య ఐపీఎల్​ 2022 ఫైనల్​ మ్యాచ్​కు రంగం సిద్ధమైంది. టైటిల్ పోరులో తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్​ బ్యాటింగ్​ ఎంచుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.