ETV Bharat / city

Top news: టాప్​ న్యూస్​ @ 7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana top news
టాప్​ న్యూస్​ @ 7PM
author img

By

Published : Jan 10, 2022, 6:59 PM IST

  • తల్లి, సోదరి అరెస్టు

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో తల్లి, సోదరి అరెస్టయ్యారు. ఏ-3, ఏ-4గా ఉన్న రామకృష్ణ తల్లి, సోదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • అ తర్వాతే లాక్​డౌన్​పై నిర్ణయం..

Kishan Reddy On Lockdown: దేశంలో లాక్​డౌన్​ విధింపుపై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లాక్​డౌన్​ సహా ఆంక్షలు విధించే అధికారం రాష్ట్రాలకు ఇచ్చినట్లు చెప్పారు. సంక్రాంతి తర్వాత దేశంలోని పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వం లాక్​డౌన్​పై నిర్ణయం తీసుకుంటుందన్నారు.

  • ' ఆ జీవోను ఎందుకు కొట్టివేయలేదు'

Revanth reddy: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చీలిక తీసుకొచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. చెరో వర్గాన్ని మచ్చిక చేసుకుందామని తెరాస, భాజపా కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.

  • మంత్రిని కలిసిన ఏపీ ఎమ్మెల్యే

Harish rao and Balakrishna meeting : తెలంగాణ మంత్రి హరీశ్ రావుతో ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ భేటీ అయ్యారు. హైదరాబాద్​లో మంత్రి ఛాంబర్​లో సమావేశమయ్యారు.

  • కేంద్రం అలర్ట్- రాత్రి 10 గంటల వరకు !

India covid news: ప్రస్తుతం యాక్టివ్ కేసుల్లో 5-10 శాతం మంది రోగులకు ఆస్పత్రి చికిత్స అవసరమవుతోందని కేంద్రం పేర్కొంది. పరిస్థితి అస్థిరంగా ఉందని, ఆస్పత్రి చేరికలు పెరగొచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ కీలక సూచనలు చేసింది. మరోవైపు, కరోనా నేపథ్యంలో రాష్ట్రాలు మరిన్ని ఆంక్షలను అమలు చేస్తున్నాయి.

  • 'అందుకోసమే థర్డ్​ ఫ్రంట్​ '

Etela On Third Front: పరస్పర రాజకీయ అవసరాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం థర్డ్​ ఫ్రంట్​ పేరుతో చర్చలు జరుపుతోందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ విమర్శించారు. ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా భాజపా ఆధ్వర్యంలో హోమాలు తలపెట్టారు.

సర్టిఫికెట్​ ఒరిజినలా కాదా చెప్పేస్తుంది.!

fake certificates issue: ఇటీవల కాలంలో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి.. చేసే మోసాలు పెరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో ఉండే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి డీజీపీ సహా ఉన్నత విద్యామండలి అధికారులు సమావేశమయ్యారు. ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

  • తిరిగి విధుల్లోకి 'సింహా' పోలీసు

Moustache Police Suspension: మధ్యప్రదేశ్​ భోపాల్​లో జుట్టు, మీసాలు ఎక్కువగా పెంచిన కారణంగా సస్పెండ్​ అయిన కానిస్టేబుల్​ను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు అధికారులు. అతనిపై విధించిన సస్పెన్షన్​ను తక్షణమే వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

  • ప్రపంచం మొత్తం మన 'సినిమా' చూస్తోంది!

గత కొన్నేళ్లలో తెలుగు సినిమా రేంజ్​ పెరిగింది. ఒకప్పుడు మనవరకే పరిమితమైన సినిమాలు.. ఇప్పుడు ప్రపంచంలోని చాలా భాషల్లోని ఆడియెన్స్​ను మెప్పిస్తున్నాయి. కొత్త సినిమాల కోసం ఎదురుచూసేలా చేస్తున్నాయి. ఇంతకీ టాలీవుడ్​లో వచ్చిన మార్పేంటి? ఏం జరుగుతుంది?

  • సింధు.. లెక్క సరిచేస్తుందా?

PV Sindhu: ఆసియా గేమ్స్​, కామన్వెల్త్​ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి మంచి ఫామ్​ కోసం కృషి చేస్తున్నట్లు చెప్పింది భారత స్టార్ షట్లర్ పీవీ సింధు. ఆ టోర్నీల్లో ఇప్పటివరకు దక్కని పసిడిని ఈసారి ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో ఉందామె. ఈ ఏడాది కూడా వరుస టోర్నమెంట్​లతో బిజీగా గడపనున్న నేపథ్యంలో తన ప్రణాళికల గురించి వివరించింది సింధు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.