ETV Bharat / city

Top news: టాప్ న్యూస్​ @ 3PM - తెలంగాణ ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top news
టాప్ న్యూస్​ @ 3PM
author img

By

Published : May 24, 2022, 3:04 PM IST

  • ప్రధాని పర్యటనకు భద్రతా ఏర్పాట్లు

Modi Hyderabad Tour : ఈనెల 26న ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ వార్షికోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఐఎస్‌బీ విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నారు. ప్రధానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. వివరాలు మాత్రం సైబరాబాద్ పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.

  • పాక్​లోనే దావూద్​ ఇబ్రహీం.. !

Dawood Ibrahim in Karachi: అండర్​వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీం ఆచూకీ లభించింది. పాకిస్థాన్​లోని కరాచీలోనే ఉన్నట్లు దావూద్​ మేనల్లుడు చెప్పాడని ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో దావూద్​ అంశాన్ని కేంద్రం సీరియస్​గా తీసుకుని చర్యలు చేపట్టాలని డిమాండ్​ చేశారు మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్​ వాల్సే.

  • మంత్రి అరెస్ట్.. అసలేం జరిగింది?

Bhagwant mann: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, పదవి కోల్పోయిన పంజాబ్​ ఆరోగ్య శాఖ మంత్రి విజయ్​ సింగ్లాను ఏసీబీ అరెస్ట్​ చేసింది. కేబినెట్​ నుంచి ఆయనను ముఖ్యమంత్రి భగవంత్​ మాన్ తొలగించిన కొద్దిసేపటికే అధికారులు ఈ చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ఒక్క శాతం అవినీతికి కూడా అవకాశం ఇవ్వమన్నారు సీఎం.

  • 'కేసీఆర్ సారథ్యంలో పెట్టుబడులు.. పక్క రాష్ట్రాలకు శూన్యం'

Ministers Fire on BJP leaders: రాష్ట్ర అభివృద్ధి గురించి ఏనాడూ ఆలోచించని జాతీయ పార్టీల ఎంపీలు.. ఇప్పుడు రాష్ట్ర పర్యటనలు చేస్తూ ప్రజలను మాయమాటలతో మభ్య పెట్టాలని చూస్తున్నారని తెరాస నేతలు ఆరోపించారు. వారికి రాష్ట్ర ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెప్పాలని సూచించారు. ఖమ్మంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పువ్వాడ, సత్యవతి, ఎంపీ నామ నాగేశ్వర రావు పాల్గొన్నారు.

  • నీ బిడ్డ పెళ్లికి నేనే పైసలిచ్చిన..!

Malla Reddy Comments on Revanth Reddy: తాను ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై మంత్రి మల్లారెడ్డి విరుచుకుపడ్డారు. రేవంత్‌రెడ్డి అడుగడుగునా తనను బ్లాక్‌మెయిల్‌ చేసి.. బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తను విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయం కోసం భూములు కొన్న విషయం వాస్తవమే అయినా.. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • ఒక కళాశాలలో చేరి... మరో కళాశాలలో చదువుకోవచ్చు..!

ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశంలోనే తొలిసారిగా క్లస్టర్ విధానానికి తెరలేపింది. ఈ విధానం వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. ఇందులో ఏదైనా ఒక కళాశాలలో చేరిన విద్యార్థి వేరొక కళాశాలలో చేరే అవకాశం చిక్కుతుంది.

  • వరకట్న భూతానికి 'విస్మయ' బలి..

Kerala Vismaya death case verdict: సంచలనం రేపిన ఆయుర్వేద వైద్య విద్యార్థి విస్మయ ఆత్మహత్య కేసులో కేరళ కోర్టు దోషికి శిక్ష ఖరారు చేసింది. కట్నం కోసం వేధించి, ఆమె బలవన్మరణానికి పాల్పడేలా చేసిన భర్తకు పదేళ్లు కారాగార శిక్ష వేసింది.

  • బీమా కోసం భర్తను చంపిన భార్య!

wife killed her husband: బీమా సొమ్ము కోసం భర్తనే హత్య చేసింది ఓ భార్య. ఆపై గుర్తుతెలియని దుండగులు తన భర్తను హత్య చేశారంటూ నమ్మించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన పంజాబ్​లోని అమృత్​సర్​ సమీపంలో జరిగింది.

  • రిటైర్మెంట్ తర్వాత ఇలా చేయండి!

best investment for retirement income: పదవీ విరమణ.. రోజువారీ పని ఒత్తిళ్లకు దూరంగా ఉన్నప్పటికీ.. మలి జీవితంలో ఒక ప్రత్యేకమైన ఆర్థికపరమైన సవాళ్లను తీసుకొస్తాయి. ఆర్జించే వయసులో చేసిన చిన్న పొరపాట్లే ఇప్పుడు ఎంతో ఖరీదైనవిగా కనిపిస్తుంటాయి. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా.. విశ్రాంత జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించేందుకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

  • అకీరా కోసం పవన్​కల్యాణ్-​రేణుదేశాయ్‌!

పవన్​కల్యాణ్​.. తన మాజీ భార్య రేణుదేశాయ్‌తో క‌లిసి దిగిన ఒక ఫొటో సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అవుతోంది. అయితే ఈ ఫొటో ఎక్కడ దిగారు? ఎందుకు దిగారో తెలుసుకోవాలంటే.. ఇది చదివేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.