ETV Bharat / city

Telangana Top news: 9PM టాప్​ న్యూస్ - telangana topten

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

9PM TOPNEWS
9PM TOPNEWS
author img

By

Published : Sep 2, 2022, 8:58 PM IST

  • భారత నేవీలోకి స్వదేశీ యుద్ధనౌక 'విక్రాంత్'..

పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో భారతీయుల శ్రమ, మేధస్సుతో రూపుదిద్దుకున్న తొలి విమాన వాహక యుద్ధనౌక ఐఎన్​ఎస్​-విక్రాంత్​ను ప్రధాని మోదీ.. జాతికి అంకితమిచ్చారు. 262 మీటర్ల పొడవు, 62 వెడల్పు కలిగిన ఉన్న ఈ బాహుబలి నౌక.. మోదీ చేతులు మీదుగా భారత నేవీలో లాంఛనంగా చేరింది.

  • రాష్ట్రంపై వివక్షతో కేంద్రం దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతోంది: కేటీఆర్

బల్క్ డ్రగ్ పార్కు కేటాయింపులో రాష్ట్రానికి మొండి చేయి చూపడం.. తెలంగాణ పట్ల కేంద్రం వివక్షకు నిదర్శనమని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ ధ్వజమెత్తారు. అన్ని అనుమతులు, అనుకూలతలు ఉన్న హైదరాబాద్ ఫార్మాసిటీని విస్మరించి.. నాలుగేళ్లయినా పట్టాలెక్కలేని ప్రాంతాలకు కేటాయించిందని ఆరోపించారు.

  • కలెక్టర్​పై నిర్మలా సీతారామన్​ ఆగ్రహం..

రాష్ట్రం పర్యటిస్తోన్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌.. కామారెడ్డి జిల్లా కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం పంపిణీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా చెప్పాలని కలెక్టర్‌ను ప్రశ్నించారు. ఆయన సమాధానం చెప్పకపోవటంతో ఆగ్రహించారు.

  • 'అది నిరూపిస్తే రాజీనామా చేస్తా..' నిర్మలాసీతారామన్​కు హరీశ్​ సవాల్​..

రేషన్​ షాప్​లో ప్రధాని మోదీ ఫొటో పెట్టాలని కలెక్టర్​పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​ ఆగ్రహం వ్యక్తం చేయటంపై మంత్రి హరీశ్​రావు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రజలకు నిర్మల్‌ సీతారామామన్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

  • జనాభా పెరుగుదలపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

జనాభా పెరుగుదలను నియంత్రణకు మార్గదర్శకాలు రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ఈ వ్యాజ్యంపై సుప్రీం.. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

  • తీస్తా సెతల్వాద్​కు మధ్యంతర బెయిల్..

సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్​కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. పాస్​పోర్టును ట్రయల్ కోర్టులో సమర్పించాలని ఆదేశించింది. సాధారణ బెయిల్ పిటిషన్​పై నిర్ణయం గుజరాత్ హైకోర్టుదేనని స్పష్టం చేసింది.

  • బ్రిటన్​ ప్రధాని పోరులో రిషి సునాక్​ వెనుకంజ..!

బ్రిటన్‌ ప్రధాని ఎన్నికకు హోరాహోరిగా సాగిన ఎన్నికల ప్రచారం ముగిసేనాటికి విజేత ఎవరనే దానిపై కొంత స్పష్టత వచ్చింది. లిజ్​ ట్రస్ ఇప్పటి వరకు జరిగిన ప్రచారంలో ముందంజలో ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేశారు. తన మద్దతుదారులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రిషి సునాక్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  • టీమ్​ఇండియాకు షాక్..

ఆసియా కప్​లో దూసుకెళ్తున్న భారత క్రికెట్​ జట్టుకు షాక్ తగిలింది. స్టార్ ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా కుడి మోకాలికి గాయం కావడం వల్ల ఇకపై జరగనున్న మ్యాచ్​లకు అతడు హాజరు కాలేడని బీసీసీఐ వెల్లడించింది.

  • బ్రహ్మాస్త్రం ప్రీరిలీజ్​ ఈవెంట్​ రద్దు.. అదే కారణమా?

రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికగా శుక్రవారం సాయంత్రం జరగాల్సిన 'బ్రహ్మాస్త్రం' చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది.

  • వాట్సాప్​లో ఈ ట్రిక్స్ అన్నీ​ మీకు తెలుసా? ఇప్పుడు మరింత మెరుగ్గా..

ఆధునిక కాలంలో వాట్సాప్​ వాడని వారంటూ ఎవరూ ఉండరు. ఇది ఆండ్రాయిడ్​, ఐఓఎస్​లో సపోర్ట్​ చేసే ఫ్రీ మెసేజింగ్​ యాప్​. ఇప్పటికే ఎన్నో అప్డేట్స్​ వచ్చినప్పటికి దానిలో ఉన్న కిటుకులు చాలా మందికి తెలియదు. వాట్సాప్​ను ఇంకా మెరుగ్గా ఉపయోగించేందుకు ఈ 5 ట్రిక్స్ మీ కోసం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.