ETV Bharat / city

ఈటీవీ భారత్​- ముఖ్యాంశాలు - తెలంగాణ తాజా సమాచారం

top news@6AM
టాప్​న్యూస్@ 6AM
author img

By

Published : Oct 5, 2021, 5:57 AM IST

Updated : Oct 5, 2021, 7:55 PM IST

19:47 October 05

టాప్​న్యూస్@ 8PM

నిర్లక్ష్యం కారణంగానే గోల్​మాల్​..

తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్​మాల్ కేసులో యూబీఐ చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీని మూడు రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి న్యాయస్థానం అనుమతించింది. మరో ముగ్గురు నిందితులైన సత్యనారాయణ, పద్మావతి, మొహిద్దీన్​ల కస్టడీపై తీర్పును గురువారానికి వాయిదా వేసింది. మస్తాన్ వలీని రేపటి నుంచి కస్టడీలోకి తీసుకొని 6 రోజుల పాటు ప్రశ్నించనున్నారు.

శిరిడీ ఆలయంలోకి వాళ్లు రావొద్దు..

మహారాష్ట్రలోని శిరిడీ సాయిబాబా ఆలయం (Shirdi Temple Open) ఈనెల 7న తెరుచుకోనుంది. రోజుకు 15వేల మంది భక్తులు సాయిని దర్శనం చేసుకునేలా దేవాలయ ట్రస్ట్​ ఏర్పాట్లు చేసింది.

వాళ్లంతా లండన్​లోనే మకాం..

ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారుల గుట్టును పాండోరా పేపర్స్​ రట్టు చేసిన నేపథ్యంలో.. ఎగవేతదారులకు లండన్​ స్వర్గధామంగా మారినట్లు తెలుస్తోంది. పన్నుమినహాయింపుల పేరుతో అత్యంత ధనవంతులకు, శక్తిమంతులకు ఇది ప్రధాన కేంద్రమైనట్లు ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ యూకే ఆరోపించింది.

ముంబయి బౌలింగ్​.. రాజస్థాన్​ బ్యాటింగ్​..

ఐపీఎల్​ 2021లో (IPL 2021 news) భాగంగా మంగళవారం (అక్టోబర్ 5) ముంబయి ఇండియన్స్​, రాజస్థాన్​ రాయల్స్​ మధ్య (CSK Vs DC) మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్​లో టాస్ గెలిచిన ముంబయి​.. బౌలింగ్​​ ఎంచుకుంది.

మహేశ్​ దంపతులకు అరుదైన గౌరవం..

టాలీవుడ్​ స్టార్​ కపుల్​ మహేశ్​ బాబు, నమ్రత దంపతులకు అరుదైన గుర్తింపు దక్కింది. ప్రముఖ ఇంగ్లీష్​ మ్యాగ్​జైన్​ 'హలో' కోసం వీరిద్దరూ ఇంటర్వ్యూ ఇచ్చారు.ఆ మ్యాగ్​జైన్​ కోసం ప్రత్యేకంగా ఫొటోషూట్​ నిర్వహించగా.. ఆ ఫొటోలు నెట్టింట ప్రస్తుతం వైరల్​గా మారాయి.

18:39 October 05

టాప్​న్యూస్@ 7PM

అల్లిపూల వెన్నెల పాట విన్నారా..

బతుకమ్మ పండుగంటే చాలు... చిన్నారుల నుంచి పండు ముసలి వరకు.. ఊయ్యాలో ఉయ్యాలో అంటూ.. కాలు కదపక మానరు. ఈ పండుగ కోసం విడుదలయ్యే పాటలు కూడా ఓ రేంజ్​లోనే ఉంటాయి. మరి.. ఈసారి మన బతుకమ్మ పాట కోసం ఏఆర్​ రెహమాన్​, గౌతమ్​మీనన్​ రంగంలోకి దిగారు. అల్లిపూల వెన్నెల.. చెరువులోన కురవగా.. పూల ఇంద్రధనుస్సులే.. నేల మీద నిలవగా.. అంటూ సాగే ఈ పాటను.. మీరూ వినేయండి.

ఏపీ అభిప్రాయం అక్కర్లేదు..

జీఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ (Rajat Kumar Letter To Grmb Chairman) లేఖ రాశారు. చనాఖా- కొరటా డీపీఆర్‌ ఏపీకి ఇవ్వాల్సిన అవసరంలేదని లేఖలో ప్రస్తావించారు. చౌటుపల్లి హన్మంత్‌రెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ (Project Dpr) ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కేటాయింపుల మేరకే గోదావరి జలాలు వాడుకుంటున్నామని రజత్‌ కుమార్‌ వివరించారు. రెండు ప్రాజెక్టులపై ఏపీ అభిప్రాయాలు అక్కర్లేదన్నారు.

కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..

తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని(lakhimpur violence news), దర్యాప్తు సంస్థల ఎదుట హాజరయ్యేందుకు సిద్ధమని.. లఖింపుర్​ హింసాత్మక ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర సహాయ మంత్రి అజయ్​ మిశ్రా వెల్లడించారు. ఆయన కుమారుడు(ajay mishra teni son) ఆశిష్​ మిశ్రాపై ఇప్పటికే ఎఫ్​ఐఆర్​ నమోదైంది.(lakhimpur violence incident)

తాలిబన్ల అరాచకం..

అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల(Afghanistan Taliban) అనైతిక చర్యలను బయట పెట్టింది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్​. 13 మంది హజారాలను అతికిరాతకంగా చంపినట్లు పేర్కొంది. వీరిలో 11 మంది సైనికులు ఉన్నట్లు తెలిపింది. కుటుంబ సభ్యులతో పారిపోతున్నవారిపై విచక్షణారహితంగా తాలిబన్లు కాల్పులు జరిపినట్లు వెల్లడించింది.

విష్ణు సంచలన వ్యాఖ్యలు

'మా' ఎన్నికల్లో పోస్టల్​ విధానంపై ఉన్న ఆవశ్యకతను నటుడు మంచు విష్టు తెలియజేశారు. అసోసియేషన్​లో 60 ఏళ్లకు పైబడిన వారు 180 మంది ఉన్నారని.. చిత్రసీమలోని కొందరు పెద్దలు పోస్టల్​ బ్యాలెట్​ విధానాన్ని అడిగారని విష్ణు స్పష్టం చేశారు.

16:52 October 05

టాప్​న్యూస్@ 5PM

మాది మఠం కాదు..

భవిష్యత్​లోనూ అధికారంలో ఉండేది తెరాస ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి కేసీఆర్ (Kcr On Trs Party) స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రసగించిన ఆయన... పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు. వేరే పార్టీలు పగటి కలలు కంటున్నాయని ఎద్దేవా చేశారు.

ఇస్తామని చెప్పనే లేదు..

దళితులకు మూడెకరాలు ఇస్తామని చెప్పనేలేదని సీఎం పేర్కొన్నారు. ప్రతి ఎస్సీ కుటుంబానికి కనీసం 3 ఎకరాలు ఉండాలని మాత్రమే చెప్పినట్టు స్పష్టం చేశారు. దళితులకు ఎకరం ఉంటే 2 ఎకరాలు కొనిస్తామని చెప్పినట్టు పేర్కొన్నారు. ఎన్నికల అజెండాలోనూ అదే చెప్పినట్టు ఉద్ఘాటించారు. 

తెలంగాణకు ఇందులోనూ నిరాశే..

తెలంగాణకు కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ వచ్చే అవకాశం లేదని.. దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా స్పష్టం చేశారు. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో పెండింగ్ ప్రాజెక్టులు కొనసాగడం లేదని వెల్లడించారు. ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసు విషయంలో కూడా సికింద్రాబాద్ రైల్ నిలయంలో జరిగిన సమావేశంలో నిరాశే ఎదురైంది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఎంపీలతో జీఎం సమావేశమయ్యారు. భేటీలో మూడు రాష్ట్రాల్లోని రైల్వే పెండింగ్‌ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు.

ఒక్కడే 75 మందిని పెళ్లాడి..

ఓ వ్యక్తి ఇప్పటివరకు 75 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అంతేకాదు.. గత ఐదేళ్లలో 200 మంది యువతులను బంగ్లాదేశ్​ నుంచి భారత్​లోకి అక్రమ రవాణా చేశాడు. సెక్స్​ రాకెట్​ కేసులో (Sex Racket News) భాగంగా మధ్యప్రదేశ్​ పోలీసులకు పట్టుబడ్డ మునిర్​ అనే నిందితుడిని విచారించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

స్పేస్​లోకి డైరెక్టర్​, హీరోయిన్​..

సినీరంగంలో (Film in space) సరికొత్త శకానికి నాంది పలుకుతూ అంతరిక్షంలో సినిమా షూటింగ్ (Movies shot in space)​ చేసేందుకు బయల్దేరారు ప్రముఖ హీరోయిన్​, డైరెక్టర్​. ఛాలెంజ్​ అనే సినిమా కోసం.. దాదాపు 12 రోజుల పాటు అక్కడే చిత్రీకరణ జరపనున్నారు. వ్యోమగామి సారథ్యంలో 3 నెలల కఠిన శిక్షణ అనంతరం.. అంతరిక్షానికి పయనమయ్యారు.

15:52 October 05

టాప్​న్యూస్@ 4PM

ఉద్యోగార్థులకు శుభవార్త..

2, 3 నెలల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభం కానుందని.. సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు.​ దసరా తర్వాత ఉద్యోగులతో చర్చలు జరుపుతామని సీఎం కేసీఆర్​ తెలిపారు. జోనల్‌ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన ఉంటుందని స్పష్టం చేశారు. 

100 నియోజకవర్గాల్లో దళితబంధు..

ఇవాళ నా తెలంగాణ 3 కోట్ల టన్నుల వరి ధాన్యం పండిస్తోందని శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్​రావు వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా పచ్చదనం కనిపిస్తోందన్నారు. దళితబంధు హుజూరాబాద్‌ కోసం తీసుకొచ్చింది కాదని సీఎం స్పష్టం చేశారు. 1986లోనే దళితబంధు పురుడుపోసుకుందన్నారు.

నోబెల్ ​బహుమతి వరించింది వీరినే..

భౌతిక శాస్త్రంలో 2021కి గాను నోబెల్ ​బహుమతిని(nobel prize 2021 physics) దక్కించుకున్నారు సుకురో మనాబే, క్లాస్ ​హాసిల్​మేన్​, జార్జియో పారిసీ. భూతాపం, సంక్లిష్టమైన భౌతిక వ్యవస్థలపై పరిశోధనలకు గానూ వీరికి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది.

15వేల లోపు స్మార్ట్​ఫోన్లు ఇవే..

రూ.11 వేల నుంచి ₹15 వేల వరకు (smartphones under 15000)పెట్టి స్మార్ట్‌ఫోన్స్‌ (smartphones that support 5g) కొందాం అనుకుంటున్నారా? అలాంటి వారికోసమే ఈ జాబితా. మొబైల్స్ ఫీచర్లు.. ఆఫర్లు, డిస్కౌంట్లు పోగా వచ్చే ధర, వివరాలు ఇస్తున్నాం. ఓ లుక్కేయండి మరి.

'మా'లో ట్యాంపరింగ్​కు ఛాన్స్​..

'మా'(maa elections 2021) ఎన్నికలు బ్యాలెట్​ విధానంలో నిర్వహించాలని ఎన్నికల అధికారికి లేఖ రాశారు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మంచు విష్ణు. ఈవీఎంలపై తమ ప్యానెల్‌ సభ్యులకు నమ్మకం లేదని, వాటిని ట్యాంపరింగ్‌ చేసే అవకాశం ఉందని ఆరోపించారు.

14:36 October 05

టాప్​న్యూస్@ 3PM

  • ఆ నిధులపై క్లారిటీ ఇవ్వండి..

దళితబంధు పథకానికి నిధులు ఏ విధంగా సమకూరుస్తారో చెప్పాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(CLP Leader Bhatti Vikramarka) డిమాండ్‌ చేశారు. దళితబంధుపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఆలోచనలు గొప్ప ఉన్నా...అమల్లో సాధ్యపడాలని అన్నారు. నిధుల విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని కోరారు.

  • అబ్బాయికి హెలికాప్టర్​.. బాబాయికి కుట్టుమిషన్​..

లోక్ ​జనశక్తి పార్టీ(LJP news) నేతలు చిరాగ్​ పాస్​వాన్​, పశుపతి కుమార్‌కు వేర్వేరుగా పార్టీ పేర్లను, ఎన్నికల గుర్తులను కేటాయించింది ఎన్నికల సంఘం(ఈసీ). చిరాగ్​ పాసవాన్​కు హెలికాప్టర్​ను ఎన్నికల గుర్తుగా కేటాయించిన ఈసీ.. పశుపతి కుమార్​ పరాస్​కు 'కుట్టుమిషన్'​ గుర్తు ఇచ్చినట్లు తెలిపింది.

  • డ్రగ్స్​పై ముంబయి సింగం..

బాలీవుడ్‌లో డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టు రట్టు చేస్తూ డ్రగ్స్‌ డీలర్లు, సినీ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) ముంబయి జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే(Sameer Wankhede). నిందితుడు ఎంత పెద్ద సెలబ్రెటీ అయినా.. ఆయనకు అనవసరం. తప్పుచేశారంటే తాట తీయటమే సమీర్​ నైజం. తాజాగా నటుడు షారూక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ అరెస్టుతో అందరి నోట్లో నానుతున్నారు. ఇంతకీ ఎవరీ సమీర్..?

  • మళ్లీ పెరిగాయ్​..

దేశంలో పెట్రోల్(Petrol price today)​, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర 25 పైసలు పెరిగింది. లీటర్ డీజిల్​పై 30 పైసల వరకు (Diesel price today) ధర పెంచాయి చమురు మార్కెటింగ్​ సంస్థలు.

  • ప్రకాశ్​రాజ్​ ఫిర్యాదు..

'మా'లో(maa elections 2021) పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతుందని ప్రకాశ్​రాజ్​ ఆరోపించారు. 'మా' ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ఎన్నికల సహాయ అధికారి నారాయణరావుకు లేఖ అందించారు.

13:52 October 05

టాప్​న్యూస్@ 2PM

ఆ 6 గంటలు ఏం జరిగింది?

సోమవారం రాత్రి ఫేస్​బుక్, వాట్సాప్, ఇన్​స్టాగ్రాం సేవలు(facebook server down) 6 గంటలు నిలిచిపోవడం వల్ల ప్రపంచమంతా ఉక్కిరిబిక్కిరి అయి గందరగోళం నెలకొంది. ఇంత సుదీర్ఘకాలం సేవలకు అంతరాయం ఏర్పడటం(facebook not working ) కూడా ఇదే తొలిసారి. అయితే ఈ సామాజిక మధ్యమ దిగ్గజాలు ఎందుకు పని చేయలేదు? పొరపాటు ఎక్కడ జరిగింది? ఈ ఆరు గంటలు వినియోగదారుల పరిస్థితి ఏంటి? ఫేస్​బుక్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు ఏం చేశారు?

గర్భిణీపై గ్యాంగ్ రేప్

గర్భిణీపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి ఒడిగట్టారు దుర్మార్గులు. అనంతరం మహిళను ఇంట్లోనే బంధించారు. చివరకు అక్కడి నుంచి బయటపడ్డ బాధితురాలు.. ఆరు రోజుల తర్వాత మృత శిశువుకు జన్మనిచ్చారు.

ఇంకా నిర్బంధంలోనే ప్రియాంక

కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని నిర్భంధించిన సితాపుర్‌ అతిథిగృహం వెలుపల ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. అడ్డుగా ఉన్న బారికేడ్లను విసిరేసిన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రియాంకను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు.

ప్లేఆఫ్స్ చేరేదెవరు?

ఐపీఎల్‌ 14వ సీజన్‌ చివరి అంకానికి చేరువైంది. అన్ని జట్లు తమ ప్లేఆఫ్స్ (ipl 2021 playoffs)​ బెర్తులపైనే దృష్టిసారించాయి. ఇప్పటికే చెన్నై సూపర్‌ కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తమ స్థానాలను ఖరారు చేసుకున్నాయి. మిగిలిన ఒకే ఒక్క నాలుగో స్థానం కోసం నాలుగు జట్లు (ipl 2021 playoffs qualified list) పోటీపడుతున్నాయి. మరి ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయో చూద్దామా?

'అఖండ' షూటింగ్​ పూర్తి.. త్వరలోనే రిలీజ్​

బాలకృష్ణ(Balakrishna Latest Movie Updates) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'అఖండ' సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు తెలిపారు సంగీత దర్శకుడు తమన్​. త్వరలోనే థియేటర్లలో'(Akhanda Release Date) సందడి చేస్తుందని పేర్కొన్నారు.

12:49 October 05

టాప్​న్యూస్@ 1PM

నాలాలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

గతనెల 25వ తేదీన కుత్బుల్లాపూర్‌లో నాలాలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఐడీపీఎల్ కాలనీ వద్ద నాలాలో మోహన్‌రెడ్డి మృతదేహాన్ని గుర్తించారు. 

కాంగ్రెస్ కార్యకర్తల తీవ్ర నిరసన

నడి వీధిలో మహిళ గొంతు కోసి...

దిల్లీలో చిన్న దుకాణం నడుపుకొనే మహిళను గొంతు కోసి హత్య (Delhi Woman Murdered) చేశాడు ఓ దుండగుడు. మద్యం మత్తులో ఉన్న నిందితుడు.. ఉచితంగా సిగరెట్ అడిగితే ఇవ్వనందుకు (Murder for Cigarette) ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. నిందితుడిని స్థానికులు చితకబాదారు.

మరోసారి పెరిగిన పెట్రోల్​ ధరలు

బికినీలో విద్యుల్లేఖ.. 

హనీమూన్​కు(vidyullekha raman new look) వెళ్లిన హాస్యనటి విద్యుల్లేఖ రామన్ డ్రెస్​తీరుపై కొందరు విమర్శలు చేశారు. దీనికి స్పందించిన ఆమె.. వారికి గట్టిగా బదులిచ్చారు.

12:04 October 05

టాప్​న్యూస్@ 12PM

'కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ఉపశమన ప్యాకేజీ మిథ్యే'

నగరంలో వరద సమస్యను నివారించేందుకు వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి కేటీఆర్ (Minister KTR)వెల్లడించారు. నగరు శివారు ప్రాంతాల్లో మొత్తం అండర్​ గ్రౌండ్ డ్రైనేజీని నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టం చేశారు. కొవిడ్‌ సమయంలో కొత్త పెట్టుబడుల వృద్ధిలో ఎలాంటి తగ్గుదల లేదని పేర్కొన్నారు.

'తలసరి విద్యుత్ వినియోగంలో ఐదో స్థానంలో తెలంగాణ'

దేశంలో తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి(Telangana Power Minister Jagadish Reddy) తెలిపారు. విద్యుత్ వృద్ధిరేటులో మాత్రం రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉందని వెల్లడించారు. దేశంలో సంపూర్ణ విద్యుద్ధీకరణ జరిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించిందని స్పష్టం చేశారు.

'కరోనాతో విమాన రంగం కుదేలు..'

కరోనా కారణంగా విమానయాన రంగం తీవ్రంగా ప్రభావితమైందని అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ వెల్లడించింది. అయితే తీవ్రమైన సమస్యలు ఉన్నప్పటికీ.. రికవరీకి మార్గం ఉందని ఐఏటీఏ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ అన్నారు.

అద్భుత విజయం: పంత్.. ధాటిగా ఆడలేకపోయాం: ధోనీ

చెన్నై సూపర్ కింగ్స్​పై విజయం సాధించడం సంతోషంగా ఉందని దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ అన్నాడు. మరోవైపు.. తాము ధాటిగా ఆడలేకపోయామని చెన్నై కెప్టెన్ ధోనీ చెప్పాడు. సోమవారం రాత్రి దిల్లీ, చెన్నై మధ్య జరిగిన మ్యాచ్​పై ఇరుజట్లు స్పందించాయి.

'పోస్టల్​ బ్యాలెట్​తో మంచు విష్ణు మాయ'.. ప్రకాశ్​రాజ్​ ఫిర్యాదు

10:53 October 05

టాప్​న్యూస్@ 11AM

రాత్రికి రాత్రే రూ.52 వేల కోట్లు లాస్​!

ప్రపంచవ్యాప్తంగా సోమవారం ఫేస్​బుక్​​ సేవలు నిలిచిపోవడం వల్ల సంస్థ సీఈఓ మార్క్ జుకర్​బర్గ్​ భారీ నష్టాన్ని మూటగట్టుకున్నారు. అమెరికా ఎక్స్ఛేంజీలో ఫేస్​బుక్ షేర్లు దాదాపు 5 శాతం పతనమయ్యాయి. దీనితో ఆయన గంటల వ్యవధిలో రూ.52 వేల కోట్ల నష్టపోయినట్లు తెలిసింది.

అస్తవ్యస్తంగా పరిపాలన

రాష్ట్ర ఆబ్కారీ శాఖ (Telangana Excise Department) పరిపాలన అస్తవ్యస్తంగా తయారయింది. కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్న వారికి పొస్టింగ్‌లు, జీతాలు రెండూ లేవు. పదోన్నతి పొందిన అధికారులకు నాలుగు నెలలైనా పోస్టింగ్‌లు ఇవ్వలేదు. మంత్రి వద్దకు వెళ్లిన దస్త్రం వెనక్కి రావడంతో పొస్టింగ్‌ల కోసం ఎదురు చూస్తున్న అధికారుల్లో (Telangana Excise Department) ఆందోళన మొదలైంది.

యువతపై గంజాయి పంజా...

ఉన్నత శిఖరాలను అందుకోవాల్సిన యువకులు.. వ్యసనాలకు బానిసలై జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నారు. కిక్కు కోసం అడ్డదార్లు తొక్కుతూ మత్తులో చిత్తు అవుతున్నారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడి కుటుంబాలను నాశనం చేస్తున్నారు. అడ్డు చెప్పినవాళ్లపై చేయిచేసుకోవడం, ఇంట్లో సామగ్రిని విసిరేయడం, బిగ్గరగా అరవడం వంటి వికృత చేష్టలు చేస్తున్నారు. ఇలా యువత నాశనం అవుతున్నప్పటికీ ఆ ఉమ్మడి జిల్లా ఆబ్కారీశాఖ మాత్రం ప్రేక్షకపాత్ర పోషిస్తోంది.

పెరిగిన పసిడి ధర.. ఎంతంటే..?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today)ధరలు పెరిగాయి. ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

మరిచిపోలేని అనుభూతి: రకుల్​

'కొండపొలం' సినిమాలో గ్రామీణ ప్రాంత అమ్మాయిగా, అందులో గొర్రెలు కాసే యువతిగా నటించడం మరిచిపోలేని జ్ఞాపకాన్ని మిగిల్చిందని చెప్పింది హీరోయిన్​ రకుల్​ ప్రీత్​ సింగ్​. దర్శకుడు క్రిష్​తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది.

09:58 October 05

టాప్​న్యూస్@ 10AM

కనిష్ఠానికి కరోనా కొత్త కేసులు

భారత్​లో రోజువారీ కరోనా​ కేసుల సంఖ్య (Coronavirus update) క్రమంగా తగ్గుతోంది. కొత్తగా 18,346 కేసులు​ (Covid cases in India) నమోదయ్యాయి. మరో 263 మంది మృతి చెందారు. ఒక్కరోజే 29,639 మంది కొవిడ్​ను జయించారు.

అక్షరంతో ఏమార్చి.. అయినకాడికి దోచి

విహార యాత్రకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా? అందుకోసం అంతర్జాలంలో వెతుకుతున్నారా? అయితే అప్రమత్తం కావాల్సిందే. లేదంటే మీ డబ్బులు స్వాహా ఖాయమని సైబరాబాద్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొందరు కేటుగాళ్లు నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి మాయ చేస్తున్నట్లుగా వివరిస్తున్నారు.

9 రోజుల ముందే కేంద్రమంత్రి వార్నింగ్​!

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నల్లజెండాలతో నిరసన తెలుపుతున్న రైతులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా మంత్రి హెచ్చరించిన వీడియో ఒకటి నెట్టింట్లో హల్​చల్ చేస్తోంది. 'లోక్‌సభకు ఎన్నిక కావడానికి చాలా ముందు నుంచే నేనేమిటో ప్రజలకు బాగా తెలుసు' అని ఆయన చెప్పిన వీడియో వైరల్​గా మారింది.

ఒకే ఒక జట్టుగా దిల్లీ.. ధోనీ చెత్త రికార్డు

ఐపీఎల్​ 2021(IPL 2021 News)లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో ఘనవిజయం సాధించింది దిల్లీ క్యాపిటల్స్(delhi capitals ipl record). తద్వారా లీగ్​లో ఓ రికార్డును నెలకొల్పింది. అలాగే ఈ మ్యాచ్​లో ధోనీ(ms dhoni stats) స్లో బ్యాటింగ్​తో చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.

'ఎస్పీ ఎప్పటికీ జీవించే ఉంటారు'

గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను(annaatthe song release date) గుర్తుచేసుకున్నారు సూపర్​స్టార్​ రజనీకాంత్​. తన తియ్యని స్వరం రూపంలో ఎస్పీ ఎప్పటికీ జీవించే ఉంటారని అన్నారు.

08:57 October 05

టాప్​న్యూస్@ 9AM

పుణ్య స్నానాలకు సిద్ధమవుతున్న పుష్కరిణి

తెలంగాణ ప్రాశస్త్యం ప్రపంచానికి తెలిసేలా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం(Yadadri temple news) పునర్నిర్మాణమవుతోంది. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి పుష్కరిణి సిద్ధమవుతోంది. ఆలయ ఉద్ఘాటన పర్వానికి సమయం ఆసన్నమైనందుకు అధికారులు పనుల్లో వేగం పెంచారు.

ఈ నెలలోనే థర్డ్​ వేవ్​..

భారత్​లో కొవిడ్ ముప్పు తొలగిపోలేదని.. మూడో ముప్పు ప్రభావం 103 శాతం వరకు ఉండొచ్చని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. పండగ సీజన్​లలో ఒక్కసారిగా పర్యాటకుల తాకిడి పెరిగితే కష్టమేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

రైతులపైకి వాహనం దూసుకెళ్లిన దృశ్యాలు!

ఉత్తర్​ప్రదేశ్ లఖింపుర్ ఖేరిలో (Lakhimpur Kheri incident) రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడి వాహనం దూసుకెళ్లిన వీడియో ప్రస్తుతం అంతర్జాలంలో చక్కర్లు కొడుతోంది. ఇవి ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన సందర్భంగా జరిగిన హింస తాలూకు దృశ్యాలేనని తెలుస్తోంది. ప్లకార్డులు, బ్యానర్లు చేతపట్టుకొని నిరసన చేస్తున్న అన్నదాతలపైకి ఓ వాహనం వేగంగా దూసుకు రావడం వీడియోలో కనిపిస్తోంది.

ఎన్‌ఏఆర్‌సీఎల్‌తో మేలెంత?

బ్యాంకింగ్‌ రంగాన్ని సంస్కరిస్తే యావత్‌ ఫైనాన్స్‌ రంగమూ బాగుపడుతుంది. రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఎన్‌పీఏలను, ఇతర ఒత్తిళ్లను తట్టుకోగల ఆర్థిక సత్తా మన బ్యాంకులకు ఉండటం కారుచీకట్లో కాంతి పుంజంలా కనిపిస్తోంది. భారతీయ బ్యాంకుల వద్ద తగినన్ని నిధులు ఉన్నాయి కాబట్టి ఆటుపోట్లను సమర్థంగా అధిగమించగలవు. అసలు పారుబాకీలకు అవకాశమివ్వని రీతిలో బ్యాంకుల రుణ కార్యక్రమం ముందుకుసాగాలి.

తైవాన్‌ గగనతలంలోకి యుద్ధ విమానాలు

తైవాన్​ గగనతలంలోకి సోమవారం 52 యుద్ధ విమానాలను పంపించింది చైనా. (China Taiwan fighter planes) శుక్రవారం నుంచి పదుల సంఖ్యలో విమానాలను (China warplanes Taiwan) తైవాన్​పైకి పంపించి కవ్వింపులకు పాల్పడుతోంది. దీనిపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది.

07:53 October 05

టాప్​న్యూస్@ 8AM

ఉభయసభల్లో నేడు చర్చించే అంశాలివే..

నేడు శాసనసభలో దళితబంధు పథకంపై... మండలిలో మైనార్టీల సంక్షేమం, పాతబస్తీలో అభివృద్ధిపై చర్చ జరగనుంది. అనంతరం శాసనసభ వర్షాకాల సమావేశాలను పొడిగించాలనే అంశంపై నేడు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

లంచం తీసుకోవడమూ ఓ కళే!

అధికారులు లంచం (Corruption and Bribery) తీసుకోవడం కూడా ఓ కళే అయిపోయింది. ఈ ప్రక్రియలో సర్కారీ దొరలది, అధికారులది విడదీయరాని బంధంగా మారిపోయింది. అధికారులు బల్లకింద చేతులు పెట్టడంలో తప్పేమీ లేదన్నట్లుగా బీఎస్పీ ఎమ్మెల్యే రాంబాయిసింగ్‌ ఇటీవల తేల్చేశారు. స్వచ్ఛందంగా ఆమ్యామ్యాలు అందించే అమాయకులను ఆదరిస్తే తప్పేమీ కాదని అందరిపైనా ఆదరణ కురిపించారు.

జంతువుల్ని హింసిస్తే భారీ జరిమానా.. 

జంతువులపై హింసకు పాల్పడే వ్యక్తులకు భారీ జరిమానాలతో పాటు.. జైలు శిక్ష విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ప్రస్తుత చట్టాన్ని సవరించే ముసాయిదా బిల్లు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

డ్రాతో మొదలెట్టిన భారత్‌

దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఎస్‌ఏఎఫ్‌ఎఫ్‌,saff championship 2021) ఛాంపియన్‌షిప్‌ను డ్రాతో మొదలుపెట్టింది భారత్‌. సోమవారం(అక్టోబర్​ 4) బంగ్లాదేశ్‌తో జరిగిన పోరులో గెలిచే అవకాశాన్ని దూరం చేసుకున్న మనోళ్లు 1-1తో మ్యాచ్​ను ముగించారు.

ఈ వారం నామినేషన్స్‌లో వీళ్లే

బిగ్‌బాస్‌ సీజన్‌-5లో(nagarjuna bigg boss) అయిదో వారానికి సంబంధించిన నామినేషన్స్‌ ప్రక్రియ పూర్తి భిన్నంగా జరిగింది. ఈ వారం షణ్ముఖ్‌ను(big boss nomination this week) అత్యధిక మంది నామినేషన్స్‌ చేశారు. ఇతడితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?

06:46 October 05

టాప్​న్యూస్@ 7AM

సజ్జనార్ విచారణ వాయిదా

దిశ నిందితుల ఎన్​కౌంటర్(DISHA ENCOUNTER CASE)​ కేసులో సిర్పూర్కర్ కమిషన్ ​క్లూస్ టీం అధికారి వెంకన్నను ప్రశ్నించింది. ఘటనా స్థలంలో గడ్డి ఎక్కువగా ఉండటం వల్ల తూటాలు లభించలేదని ఆయన కమిషన్​కు తెలిపారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ ఇవాళ విచారణకు వెళ్లగా.. 7వ తేదీన హాజరు కావాలని కమిషన్ సూచించింది.

ఉత్తర్​ప్రదేశ్​లో మోదీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ(Pm Modi News) మంగళవారం ఉత్తర్​ప్రదేశ్​లో పర్యటించనున్నారు. ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​ @75 న్యూ అర్బన్ ఇండియా కార్యక్రమాన్ని లఖ్​నవూలో ప్రారంభించనున్నారు. అంతేకాక రాష్ట్రంలోని పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది.

ముడి చమురు ధరలు పైపైకి..!

ఓ వైపు అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరుగుతూ(Fuel Price Hike) ఉంటే.. ఆ ప్రభావాన్ని వినియోగదార్లపై వేయడం తప్ప పెద్దగా వేరే అవకాశాలు కనిపించడం లేదని ప్రభుత్వ అధికారులే అంటున్నారు. అంటే అంతర్జాతీయ మంట చల్లారనంత వరకూ మన జేబుకు చిల్లు తప్పదన్నమాట. మరో వైపు ఒపెక్‌ మరింత ఉత్పత్తికి సోమవారం ససేమిరా అనడమూ ఆజ్యం పోసే ప్రమాదం ఉంది.

కీలకపోరులో గెలుపెవరిది?

ఐపీఎల్​లో(IPL 2021 News) భాగంగా మంగళవారం(అక్టోబర్ 5) ముంబయి ఇండియన్స్- రాజస్థాన్​ రాయల్స్​(MI Vs RR 2021) మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్​ అవకాశాలను ముంబయి దాదాపుగా పోగొట్టుకోగా.. ఈ మ్యాచ్​లో గెలుపొంది నాలుగో స్థానానికి పోటీగా నిలివాలని రాజస్థాన్​ రాయల్స్​ ప్రణాళికలు రచిస్తుంది.

'ఆ షూటింగ్‌.. ఓ సాహసయాత్ర'

'కొండపొలం' (Kondapolam Movie) చిత్రీకరణ వనవాసం చేసినట్లు కాదు, ఒకరకంగా సాహసయాత్ర చేసినట్లు అనిపించిందని తెలిపారు దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి. ఈ నెల 8వ తేదీన ఈ చిత్రం విడుదల సందర్శంగా ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నారు క్రిష్. అవి మీకోసం..

05:13 October 05

టాప్​న్యూస్@ 6AM

 తెలంగాణ పట్ల  నిర్లక్ష్యం

పర్యాటకం సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్రం పట్టించుకోవడం లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. పద్మశ్రీ పురస్కారాలపై ప్రధానితో గొడవపెట్టుకున్నానని అసెంబ్లీలో వెల్లడించారు. విమానాశ్రయాలు కట్టుకుంటామన్నా ఆరున్నరేళ్లుగా తేల్చడం లేదంటూ శాసనసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

 రెండు కీలక బిల్లులకు ఆమోదముద్ర

పర్యాటకులు, ప్రయాణికులపై దళారీతనం, దుష్ప్రవర్తన నిరోధించేందుకు చట్టం కోసం శాసనసభ బిల్లును ఆమోదించింది(telangana assembly session). అపరాధానికి పాల్పడే వారికి గరిష్ఠంగా ఏడాది కాలం జైలుశిక్ష, పదివేల రూపాయలు జరిమానా విధించనున్నారు. జీఎస్టీ చట్టసవరణ బిల్లుకు(GST Amendment Bill) కూడా అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. అటు స్టాంపు చట్టానికి సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.

 రాయలసీమ ఎత్తిపోతల తీర్పు రిజర్వ్​

రాయలసీమ ఎత్తిపోతల పథకం( Rayalaseema Lift Irrigation) పనుల్లో హరిత ట్రిబ్యునల్‌ (NGT) ఆదేశాలు ఉల్లంఘించారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై (AP government) దాఖలైన కోర్టుధిక్కరణ పిటిషన్‌పై తీర్పును ఎన్జీటీ రిజర్వ్‌ చేసింది.

 ఛార్జీల బాదుడు

దసరా పండుగ వేళ సొంతూళ్లకు వెళ్తున్న వారిపై ధరల భారం పడనుంది. ఇప్పటికే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన అధికారులు అధిక శాతం ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఇక ప్రవేట్ బస్సుల ఆగడాలు చెప్పనసరం లేదు. బస్సుల్లో ప్రయాణించే వారికి 50 శాతం అదనంగా ఛార్జీల బాదుడు తప్పేలా లేదు.

కొనసాగుతోన్న దర్యాప్తు

తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్ మాల్ కేసులో(Telugu academy scam) బ్యాంకు అధికారులను సీసీఎస్ పోలీసులు మరోసారి ప్రశ్నించారు. అకాడమీ డిపాజిట్లను అగ్రసేన్ బ్యాంకుకు ఎలా బదిలీ చేశారని ప్రశ్నించారు. డిపాజిట్ల గోల్​ మాల్​ కేసులో బ్యాంకు అధికారులు, అకాడమీ సిబ్బంది పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.

 దసరాకు  ప్రత్యేక బస్సులు

దసరాకు ముందే ఆర్టీసీలో పండుగ వాతావరణం మొదలైంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీఎస్​ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. ఈనెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నాలుగు వేలకు పైగా ప్రత్యేక బస్సులను తిరగనున్నట్లు రంగారెడ్డి జిల్లా ప్రాంతీయ మేనేజర్ వరప్రసాద్ తెలిపారు.

 ఉవ్వెత్తున నిరసన జ్వాల..

లఖింపుర్‌ ఖేరి(Lakhimpur Kheri News) ఘటనపై యూపీ, దిల్లీ, పంజాబ్‌, హరియాణాలో నిరసనలు చెలరేగాయి. దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, విపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. ప్రియాంక, అఖిలేశ్.. తదితర రాజకీయనేతలను గృహనిర్బంధం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.45 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది యోగి సర్కారు.

ఆ లిస్ట్​లో లేని భారత్​!

విదేశీ ప్రయాణికుల కోసం బ్రిటన్ ప్రభుత్వం సరళించిన నిబంధనల్లోనూ భారత్​కు చుక్కెదురైంది. బ్రిటన్​లోకి అనుమతించే విదేశీ ప్రయాణికుల జాబితాలో భారత్ పేరును ప్రస్తావించలేదు. మరోవైపు బ్రిటన్​ నుంచి వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్​ను(India UK quarantine rules) తప్పనిసరి చేసింది భారత ప్రభుత్వం.

సేవలు పునరుద్ధరణ

దాదాపు 7 గంటల తర్వాత వాట్సప్‌ సేవలు పునరుద్ధరణించారు. సోమవారం రాత్రి 9 గంటల తర్వాత.. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతో  సేవలు నిలిచిపోయాయి.సేవలు నిలిచిపోవడంతో కొన్ని గంటల పాటు వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. 

చెన్నైపై దిల్లీ విజయం

ఐపీఎల్​లో సోమవారం జరిగిన ఉత్కంఠ మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ జట్టు విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని పంత్​సేన ఛేదించింది. ఫలితంగా చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టుపై దిల్లీ క్యాపిటల్స్​ 3 వికెట్ల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరు కుంది.

Last Updated : Oct 5, 2021, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.