1. 'చట్టాలు తయారు చేయమని ప్రభుత్వానికి చెప్పలేం..'
చట్టాలు తయారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ బాధ్యత శాసన, పాలన వ్యవస్థదేనని... తాము ఆదేశాలివ్వలేమని పేర్కొంది. ఏ శ్మశానం కబ్జా అయిందో స్పష్టంగా పేర్కొంటూ.. ఆధారాలను సమర్పిస్తే విచారణ చేపట్టగలమని తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
2. కొవాగ్జిన్ తొలిదశ క్లినికల్ ట్రయల్స్ వాలంటీర్ల డిశ్చార్జ్
భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కొవాగ్జిన్ తొలిదశ క్లినికల్ ట్రయల్స్‌లో ముందడుగు పడింది. సోమవారం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో ఇద్దరు వాలంటీర్లకు కొవాగ్జిన్ ఇచ్చారు. ఆ ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని నిమ్స్ వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
3. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ: కేటీఆర్
ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీనీ విస్తరించి ఉన్నచోటనే యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని ఐటీ పురపాలక శాఖమంత్రి కేటీఅన్నారు. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదని ఇప్పుడు ఇంటెలిజెంట్ టెక్నాలజీగా మారిపోయిందని చెప్పారు. కరీంనగర్లో ఐటీ హబ్‌ను ప్రారంభించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
4. సిగిరెట్ కోసం అర్ధరాత్రి కర్రలతో దాడి
అర్ధరాత్రి సిగిరెట్ కోసం ఇద్దరు వ్యక్తులు నానా హంగామా సృష్టించారు. సిగిరెట్ ఇవ్వనందుకు ఇద్దరు వ్యక్తులు కర్రలతో దాడితెగబడిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
5. బాలికను ఎత్తకెళ్లి, 100 సార్లు అత్యాచారం చేసి..
హరియాణాకు చెందిన ఓ 14 ఏళ్ల బాలికను గ్రామస్థులే ఎత్తుకెళ్లారు. కామం కట్టలు తెంచుకున్న మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మోజు తీరిపోయాక వ్యభిచార గృహానికి వెళ్లి అమ్మాయిని బేరం పెట్టారు. అమ్ముకుని సొమ్ము చేసకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
6. కరోనా వ్యాప్తి, మరణాల రేటు భారత్‌లోనే తక్కువ!
ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్‌లో కరోనా కేసులు, మరణాలు చాలా తక్కువగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. భారత్‌లో 10 లక్షల జనాభాకు కేవలం 837 పాజిటివ్ కేసులు, 20.4 మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది. మిగతా దేశాల్లో కొవిడ్ కేసులు 12-13 రెట్లు, మరణాలు 21-33 రెట్లు ఉన్నాయని పేర్కొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
7. ఓలి-ప్రచండ మధ్య రాజీకి ఎన్సీపీ విఫలయత్నం
మంగళవారం జరిగిన నేపాల్ కమ్యూనిస్టు పార్టీ సమావేశం.. ప్రధాని కేపీ శర్మ ఓలి, పార్టీ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్ పుష్ప కమల్ దహల్ (ప్రచండ)ల మధ్య విబేధాలను పరిష్కరించడంలో విఫలమైంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
8. స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.192 పెరిగి రూ.50,214కి చేరింది. కిలో వెండి ధర రూ.56,441కి చేరింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
9. టీ20 ప్రపంచకప్ వాయిదా.. ధోనీ కెరీర్‌పై నీలినీడలు!
భారత క్రికెట్ జట్టులో తనదైన ముద్ర వేసిన ధోనీ.. ఐపీఎల్ 13వ సీజన్లో సత్తా చాటి ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌తో జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడని అంతా భావించారు. కానీ అనూహ్య రీతిలో కరోనా కారణంగా ఈ మెగాటోర్నీ వాయిదా పడింది. దీంతో మహీ.. టీమ్ఇండియా పునరాగమనానికి బ్రేక్ పడినట్లైంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
10. 'ఆ ముగ్గురితో నటించాలనే కల నెరవేరింది'
బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, రణ్‌బీర్ కపూర్‌తో కలిసి నటించాలనే కోరిక నిజమవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది హీరోయిన్ వానీ కపూర్. ప్రతిభ, వృత్తి పట్ల నిబద్ధత వీరిలో ఉన్నాయని వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.