1. పరీక్షలు వాయిదా వేయాలి
కొవిడ్ దృష్ట్యా నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలతో మోదీ, కేసీఆర్ చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. వాయుసేనలోకి 'రఫేల్ జెట్స్'!
రఫేల్ యుద్ధ విమానాలు సెప్టెంబర్ 10 అధికారికంగా వైమానిక దళంలోకి చేరనున్నాయి. అంబాలా వైమానిక స్థావరంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి భారత్, ఫ్రాన్స్ రక్షణ మంత్రులు హాజరుకానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఉగ్రవాదం ఒక క్యాన్సర్
ఉగ్రవాదం అనే క్యాన్సర్.. మహమ్మారిలా ప్రతిఒక్కరిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు విదేశాంగ మంత్రి జైశంకర్. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్‌పై పరోక్ష విమర్శలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. అచ్చెన్నాయుడికి బెయిల్
ఏపీ మాజీమంత్రి అచ్చెన్నాయుడికి ఆ రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షలు పూచీకత్తు చెల్లించాలని... దేశం విడిచి వెళ్లరాదని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'గంజాయి పొట్లాల' పార్సిల్!
కర్ణాటకలో రోజుకో గంజాయి కేసు బయటపడుతోంది. తాజాగా ఓ 14 ఏళ్ల బాలుడి పేరు మీద వచ్చిన కొరియర్ లో గంజాయి పార్సిళ్లను చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. రాజీనామా దిశగా జపాన్ ప్రధాని
తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేనందున ప్రధాని పదవికి రాజీనామా చేయనున్నారు జపాన్ ప్రధాని షింజో అబే. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. టిక్‌టాక్ కోసం..
టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాల కొనుగోలు రేసులో రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ చేరింది. మైక్రోసాఫ్ట్‌తో కలిసి టిక్‌టాక్‌ను దక్కించుకునేందుకు సమాలోచలను జరుపుతున్నట్లు వాల్‌మార్ట్ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. కోహ్లీ బ్యాటింగ్ పొజిషన్‌పై క్లారిటీ!
ఈసారి ఐపీఎల్లో విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే, ఈ ఊహాగానాలకు తెరదించే ప్రయత్నం చేశాడు ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మైక్ హెసన్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. సిక్స్ కొట్టి సొంత కారు అద్దం పగలగొట్టుకున్నాడు!
ఐర్లాండ్ క్రికెటర్ కెవిన్ ఓబ్రియాన్ ఇటీవలే ఓ మ్యాచ్‌లో ఎనిమిది సిక్సర్లు కొట్టాడు. అయితే, అందులో ఒక సిక్స్ వల్ల పార్కింగ్‌లో ఉంచిన తన కారు అద్దం పగిలిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10.అదా శర్మ కొత్త సినిమా టైటిల్ '?'
ముద్దుగుమ్మ అదాశర్మ కొత్త చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. '?' (క్వశ్చన్ మార్క్) టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆసక్తిని రేకెత్తిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.