ETV Bharat / city

మేం విడాకులు తీసుకోబోతున్నాం: నాగ చైతన్య, సమంత

ప్రముఖ టాలీవుడ్ జోడీ నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు చైతూ, సమంత.

samantha naga chaitanya divorce
samantha naga chaitanya divorce
author img

By

Published : Oct 2, 2021, 4:34 PM IST

నాగచైతన్య- సమంత వివాహ బంధం ముగిసిపోయిందంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. వారిద్దరూ ఒకరికొకరు దూరంగా ఉంటున్నారని.. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని ఈ వార్తల సారాంశం. ఇన్ని రోజులు ఈ పుకార్లకు దూరంగా ఈ జోడీ ఎట్టకేలకు స్పష్టతనిచ్చింది. తామిద్దరం విడాకులు తీసుకోబోతున్నట్లు వెల్లడించారు చైతూ, సామ్. సామాజిక మాధ్యమాల ద్వారా ఇద్దరూ ఒకే సందేశాన్ని పోస్ట్ చేశారు. దీంతో ఈ విషయంపై స్పష్టతవచ్చినట్లైంది.

"చాలా రోజులు చర్చించిన తర్వాత సమంత, నేను భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. దశాబ్ద కాలంగా మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని అదృష్టంగా భావిస్తున్నాం. మా మధ్య ఉన్న స్నేహం చాలా ప్రత్యేకమైంది. ఇలాంటి కఠిన సమయంలో మమ్మల్ని అర్థం చేసుకోవాలని అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియాను కోరుతున్నాం" అని వెల్లడించారు చైతూ, సామ్.

అక్కడే మొదలైంది!

2017లో హీరో నాగచైతన్యను పెళ్లి చేసుకున్న సమంత.. అనంతరం తన సోషల్​మీడియా అకౌంట్లలో సమంత పక్కన 'అక్కినేని' పదాన్ని జోడించింది. కానీ అకస్మాతుగా ట్విట్టర్​, ఇన్​స్టా నుంచి అక్కినేని పదాన్ని తొలగించి ఎస్​ అక్షరం పెట్టుకోవడంపై సర్వత్రా చర్చ మొదలైంది. ఈ అంశంపై స్పందించిన సమంత.. 'అనవసర విషయాలపై వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని' కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడం అభిమానులను మరింత సందిగ్ధంలో పడేసింది.

ఇటీవల సమంత తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నాగచైతన్య-సమంత విషయంలో వస్తున్న రూమర్స్‌పై ఓ విలేకరి ప్రశ్నించగా సామ్‌ కాస్త ఘాటుగానే స్పందించారు. దీంతో మళ్లీ వీరి మధ్య ఏదో జరుగుతోంది అనే అంశం తెరపైకి వచ్చింది. తాజా ప్రకటనతో వీరి విడాకులపై ఓ క్లారిటీ వచ్చేసింది.

ఇదీ చూడండి: నాగచైతన్య-సమంత విడిపోతున్నారా.. నిజమెంత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.