Telangana Weather report: నేడు, మంగళవారం(రేపు) రాష్ట్రంలో పలు చోట్ల కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఈ రోజు ఆగ్నేయ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల నుంచి మరత్వాడ్ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు ఆవరించి ఉన్న ఉపరితల ద్రోణి బలహీనపడిందని వాతావరణ కేంద్రం సంచాలకులు స్పష్టం చేశారు. అదే విధంగా దక్షిణ చత్తీస్‌గడ్ పరిసర ప్రాంతాలలో సగటున సముద్ర మట్టానికి సుమారు 0.9కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని సంచాలకులు తెలిపారు. ఆదివారం సాయంత్రం అక్కడక్కడా కొన్ని చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. దాంతో ప్రజలకు వేసవితాపం నుంచి కొంత ఉపశమనం లభించింది.
ఇదీ చదవండి:CM KCR in TRSLP Meeting: ''ది కశ్మీర్ ఫైల్స్'ను పక్కనబెట్టి.. ప్రజాసమస్యలపై దృష్టి పెట్టాలి'