రాష్ట్రంలో రానున్న మూడు రోజుల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం రాష్ట్రంలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో 2.1 కిమీ నుంచి 4.5 కిమీ ఎత్తు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావారణ కేంద్ర సంచాలకులు తెలిపారు.
ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపునకు వంపు తిరిగి ఉందని.. తద్వారా రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇదీ చూడండి: 'జవాన్ల త్యాగాలను గుర్తిద్దాం... కేంద్ర వైఫల్యాలను ఎత్తిచూపిద్దాం'