ETV Bharat / city

ఇంటర్ రీవాల్యుయేషన్​ దరఖాస్తుకు నేడే ఆఖరి రోజు

Inter Reverification Application : రాష్ట్రంలో ఇంటర్ జవాబుపత్రాల పునఃపరిశీలన కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. కొందరు తాము పాసవుతామని, మరికొందరు మార్కులు పెరుగుతాయని పోటాపోటీగా దరఖాస్తు చేస్తున్నారు. నేటితో గడువు ముగియనుండడంతో మరిన్ని దరఖాస్తులు రావొచ్చని భావిస్తున్నారు.

rescrutiny of inter answer sheets
rescrutiny of inter answer sheets
author img

By

Published : Jul 6, 2022, 8:21 AM IST

Inter Reverification Application : ఇంటర్‌ జవాబుపత్రాల పునఃపరిశీలన కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. తాము పాసవుతామని కొందరు, మార్కులు పెరుగుతాయని మరికొందరు విద్యార్థులు పునఃపరిశీలనకు దరఖాస్తు చేస్తున్నారు. అందుకు ఈనెల 6వ తేదీ వరకు గడువిచ్చారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రికి 17,995 జవాబుపత్రాలకు సంబంధించి దరఖాస్తులు అందాయి. పునఃమూల్యాంకనానికి మరో 3,943 దరఖాస్తులు వచ్చాయి. బుధవారం కూడా గడువు ఉన్నందున చివరిరోజు మరిన్ని దరఖాస్తులు రావొచ్చని భావిస్తున్నారు. తప్పిన వారితోపాటు ఇంప్రూవ్‌మెంట్‌ కోసం దరఖాస్తు గడువు కూడా బుధవారంతో ముగియనుంది.

ఇంటర్‌ ప్రవేశాలకు లాగిన్‌ ఎప్పుడు.. పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలైనా కళాశాలల్లో ఫస్టియర్‌లో చేరేందుకు వచ్చిన విద్యార్థుల పేర్లను నమోదు చేసేందుకు పోర్టల్‌ లాగిన్‌ అవకాశం ఇవ్వలేదని, దాన్ని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్రాధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్‌ తెలిపారు. ఈ మేరకు వారు ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌కు మంగళవారం వినతిపత్రం సమర్పించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.