శుభకాలం. విశేషమైన ప్రగతిని సాధిస్తారు. ఆశయాలు నెరవేరుతాయి. సమయానికి బుద్ధిబలం పనిచేస్తుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. అవసరానికి అనుగుణంగా ముందుకు సాగడం మేలు. శివారాధన శుభాన్నిస్తుంది.
మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. విష్ణు నామస్మరణ ఉత్తమం.
ఆటంకాలు ఎదురైనప్పటికీ సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. శ్రమతో కూడిన సత్ఫలితాలను సాధిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాల్లో లాభాన్ని ఆర్జిస్తారు. లక్ష్మీ స్తోత్రం పఠిస్తే మంచిది.
మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. శివపార్వతులను పూజించడం వలన శుభం కలుగుతుంది.
గ్రహబలం పరిపూర్ణంగా రక్షిస్తోంది. గొప్ప ఆలోచనా విధానంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. శివ అష్టోత్తరం పఠించాలి.
చేపట్టిన పనులను మనోబలంతో పూర్తిచేస్తారు. ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. గోసేవ చేయడం మంచిది.
చేపట్టిన పనులను పక్కా ప్రణాళికతో పూర్తిచేస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. సూర్యాష్టకం పఠించడం మంచిది.
ఉత్సాహంగా పనిచేయాలి. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి మొదలుపెట్టాలి. చంచల బుద్ధితో ఇబ్బందులు ఎదురవుతాయి. అనవసర విషయాల్లో తలదూర్చకండి. లక్ష్మీ ధ్యానం చేస్తే మంచిది.
చేపట్టిన పనుల్లో సత్ఫలితాలు సాధిస్తారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.
శుభకాలం. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించడం మంచిది.
ధర్మచింతనతో వ్యవహరిస్తారు. మంచివారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. ఒత్తిడి నుంచి బయట పడే మార్గాన్ని ఆలోచించాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. సూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభదాయకం.
కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. శ్రీరామ నామాన్ని జపించడం ఉత్తమం.
ఇదీ చదవండి: NWDA: గోదావరి-కావేరి అనుసంధానం... రాష్ట్రాలకు ప్రాజెక్ట్ నివేదిక