ETV Bharat / city

New Corona Cases: రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 733 కేసులు

New Corona Cases: రాష్ట్రంలో కరోనా మూడో దశ ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. రోజురోజుకు కేసులు తగ్గిపోతున్నాయి. కొత్తగా 733 పాజిటివ్​ కేసులు నమోదవటమే ఇందుకు నిదర్శనం.

TODAY CORONA CASES IN TELANGANA
TODAY CORONA CASES IN TELANGANA
author img

By

Published : Feb 11, 2022, 8:15 PM IST

New Corona Cases: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 56,487 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 733 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 7,81,569‬కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,104కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 2,850 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15,636 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Corona cases in India: దేశంలోనూ కరోనా కేసులు వరుసగా రెండోరోజు తగ్గాయి. కొత్తగా 58,077 మందికి వైరస్​ సోకింది. కొవిడ్​ ధాటికి మరో 657మంది ప్రాణాలు కోల్పోయారు. 1,50,407 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.89 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్​ కేసులు ప్రస్తుతం 1.64 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 97.17 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 4,25,36,137
  • మొత్తం మరణాలు: 5,07,177
  • యాక్టివ్ కేసులు: 6,97,802
  • మొత్తం కోలుకున్నవారు: 4,13,31,158

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.