ETV Bharat / city

వ్యవసాయ అధికారుల సంఘం డైరీ ఆవిష్కరించిన నిరంజన్​రెడ్డి - తెలంగాణ వార్తలు

తెలంగాణ వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం డైరీని మంత్రి నిరంజన్​రెడ్డి ఆవిష్కరించారు. డిప్లొమా విద్యార్హత కలిగిన ఏఈవోల సమస్యలను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డికి కేంద్ర టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్​ వివరించారు. వారికి ఒక పదోన్నతి కల్పించాలని కోరారు.

వ్యవసాయ అధికారుల సంఘం డైరీ ఆవిష్కరించిన నిరంజన్​రెడ్డి

author img

By

Published : Jan 12, 2021, 5:07 PM IST

Updated : Jan 12, 2021, 5:52 PM IST

తెలంగాణ వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం డైరీని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హైదరాబాద్​లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్​తో పాటు పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. డిప్లొమా విద్యార్హత కలిగిన ఏఈవోల సమస్యలను మంత్రి వివరించినట్లు రాజేందర్ తెలిపారు. డిప్లొమా విద్యార్హత కలిగిన ఏఈవోలు ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పదవీ విరమణ పొందే వరకు.. ఒకే క్యాడర్​లో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందుతున్నారని తెలిపారు. మొత్తం ఉద్యోగ సర్వీస్​లో కనీసం ఒక పదోన్నతి వ్యవసాయ అధికారిగానైనా కల్పించాలని కోరినట్లు రాజేందర్​ పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ శాఖలో అధిక సంఖ్యలో గ్రేడ్-2 వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించామని.. దానికి అనుగుణంగా 20శాతం గ్రేడ్-1 క్యాడర్ పోస్టుల్లో సంఖ్యను పెంచాలని కోరారు. అలానే గ్రేడ్-1 పోస్టులకు డిప్యూటీ అగ్రికల్చర్ ఆఫీసర్​గా పేరు మార్చి పదోన్నతి కల్పించి... పదోన్నతి లేని గ్రేడ్-1 వ్యవసాయ విస్తరణ అధికారుల ఆత్మస్థైర్యాన్ని పెంచాలని మంత్రిని కోరినట్లు రాజేందర్ తెలిపారు.

ఇదీ చదవండి: 'కరోనా త్వరగా తొలిగిపోయి ప్రజలంతా సంతోషంగా ఉండాలి'

Last Updated : Jan 12, 2021, 5:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.