లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తోన్న సహాయాన్ని మరింత పెంచాలని తెజస అధ్యక్షుడు కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 12 కిలోల బియ్యం, పప్పు, పంచదార, నూనెతో పాటు 5 వేల నగదును చెల్లించాలన్నారు. తార్నాకలోని ఆయన నివాసం వద్ద మున్సిపల్ సిబ్బందికి నిత్యవసర సరకులను పంపిణి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు పేద ప్రజలను ఆదుకోవాలని సూచించారు.
ఇవీచూడండి: 27 నుంచి కొహెడలోనే పండ్ల మార్కెట్: సబితా ఇంద్రారెడ్డి