బలవంతపు భూ సేకరణను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం డిమాండ్ చేశారు. పేదల భూములతో ప్రభుత్వం వ్యాపారం చేయడం బాధాకరమన్నారు.
హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో.. బలవంతపు భూసేకరణ ఆపాలంటూ రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. భూ నిర్వాసితులు చేస్తున్న పోరాటానికి అన్ని పార్టీలు మద్దతు తెలపాలని కోదండరాం కోరారు. అసైన్డ్ భూమి సేకరించినా... పట్టా భూములతో సమానంగా పరిహారం, పునరావాసం అందించాలని డిమాండ్ చేశారు.
'బలవంతపు భూ సేకరణను వెంటనే ఆపాలి. పేదల భూములతో ప్రభుత్వం వ్యాపారం చేయడం బాధాకరం. భూనిర్వాసితుల పోరాటానికి అన్నీ పార్టీలు మద్దతు తెలపాలి. అసైన్డ్ భూమి సేకరించినా... పట్టా భూములతో సమానంగా పరిహారం, పునరావాసం అందించాలి.'
- ఆచార్య కోదండరాం, తెజస అధ్యక్షుడు
ఇదీచూడండి: podu lands issue: నేటి నుంచి పోడు భూముల దరఖాస్తుల స్వీకరణ