ETV Bharat / city

చంద్రగిరి ఓటర్లకు.. తిరుమల శ్రీవారి ప్రసాదం! - తిరుపతి లడ్డూలు తాజా వార్తలు

ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో అభ్యర్థులు ఓటర్లకు తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని పంచుతున్నట్లు బయటపడింది. తొండవాడ పంచాయతీలో అధికార పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థి శుక్రవారం ఎన్నికల ప్రచారం చేశారు. అదే సమయంలో ఇంటింటికీ రేషన్‌ బియ్యం సరఫరా చేస్తూ.. శ్రీవారి ప్రసాదాలను ఓ సంచిలో పెట్టి అందించారు.

tirupati-laddu-for-chandragiri-voters-in-chittoor-district
చంద్రగిరి ఓటర్లకు.. తిరుమల శ్రీవారి ప్రసాదం!
author img

By

Published : Feb 20, 2021, 2:23 PM IST

ఏపీలోని తిరుమల కొండపైనే సామాన్య భక్తులకు లడ్డూల కొరత ఉంటే.. చంద్రగిరి, పాకాల మండలాల్లోకి ఇన్ని లడ్డూలు ఎలా వస్తున్నాయన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పాకాల, మొగరాల, ఉప్పరపల్లితోపాటు చంద్రగిరి, తొండవాడ, తిరుచానూరు, ముంగిలిపట్టుల్లో ఓటర్ల ఇళ్లకు పదుల సంఖ్యలో లడ్డూలు అందాయి. తితిదే ఇటీవల ఒక్కో భక్తుడికి ఒక్క లడ్డూ మాత్రమే ఉచితంగా ఇస్తూ.. ఆపై ఒక్కో లడ్డూకు రూ.50 చొప్పున వసూలు చేస్తోంది. ఈ అదనపు ప్రసాదంపై నిర్దిష్టంగా పరిమితి విధించకపోయినా.. వందల కొద్ది కొనుగోలు చేసే వీల్లేదు. 22 వేల మంది ఓటర్లున్న తిరుచానూరు గ్రామంలో సగం కుటుంబాలకు పెద్ద లడ్డూ, వడ అందినట్లు సమాచారం.

ఎలా వచ్చాయి?

ఇక్కడ 11 వేల పెద్ద లడ్డూలు, అదే సంఖ్యలో వడలు అందించాలంటే.. తితిదే యంత్రాంగం సహకారం లేకుండా సాధ్యం కాదని, దీని వెనుకాల ఎవరున్నారన్నది తేల్చాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. లడ్డూలపై పరిమితి లేకపోయినా.. వడలు మాత్రం కౌంటర్‌ వద్ద ఒక్కో భక్తుడికి రెండు మాత్రమే ఇస్తున్నారు. ఇక్కడ ఇన్నేసి వడలు ఎలా వచ్చాయి? అధికార పార్టీకి చెందిన నేతలు చెబితే ఇచ్చారా? వంటి పలు సందేహాలు తలెత్తుతున్నాయి.

మహా అపచారం: లోకేశ్‌

తొండవాడలో వైకాపా నేతలు తిరుమల లడ్డూలను ఓటర్ల స్లిప్పులతో పాటు పంచి శ్రీవారికి మహాపచారం తలపెట్టారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. ‘ఎస్సీలకు 5, ఇతరులకు 10 చొప్పున లడ్లూ పంపిణీ చేసి కులవివక్ష చూపారు. లడ్డూలను పంచిన అభ్యర్థిని పోటీకి అనర్హులుగా ప్రకటించాలి. భక్తులకు దొరకని పరిస్థితిలో ఇన్ని వేల లడ్డూలు తరలించిన వైకాపా నేతలు, వారికి అందించిన తితిదే యంత్రాంగంపై చర్యలు చేపట్టాలి’ అని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందిస్తూ తిరుమల ప్రసాదంతోనూ వైకాపా నేతలు రాజకీయాలు చేయడం దిగజారుడుతనమని విమర్శించారు. దీనిపై ఎస్‌ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు.

చంద్రగిరి ఓటర్లకు.. తిరుమల శ్రీవారి ప్రసాదం!

ఇదీ చదవండి: వైఎస్​ నాటి స్వర్ణయుగాన్ని మళ్లీ తెచ్చుకుందాం: షర్మిల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.