ETV Bharat / city

Tirupati floods latest news : వరద నీటిలో తిరుపతి.. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం - Tirupati flood news today

ఏపీలోని తిరుపతిలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు (Tirupati floods latest news 2021) నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఇళ్లల్లో వరద ప్రవాహంతో ముంపుప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైళ్లలో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

Tirupati floods latest news
Tirupati floods latest news
author img

By

Published : Nov 21, 2021, 1:23 PM IST

తిరుపతిలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నగరం జలదిగ్బంధం(Tirupati floods latest news 2021)లో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఇళ్లల్లో వరద ప్రవాహంతో ముంపుప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు రైళ్ల రాకపోకలకు (train services stopped in tirupati) అంతరాయం ఏర్పడింది. రైళ్లలో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

తిరుపతిలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఇళ్లల్లో వరద ప్రవాహంతో ముంపుప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో తిరుపతి నగరంలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. పేరూరు, పెరుమాళ్లపల్లి చెరువుల నుంచి వరద నీరు నగరంలోకి వస్తోంది. దీంతో పట్టణంలోని పలు కాలనీల్లో వరద నీరు ఇంకా తొలగలేదు.

వరద నీటిలో తిరుపతి

ఇంకా జలదిగ్బంధంలోనే...

గాయత్రినగర్‌, సరస్వతి నగర్‌, శ్రీకృష్ణనగర్‌ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ముత్యాలరెడ్డిపల్లి, ఉల్లిపట్టెడ, దుర్గానగర్‌ ప్రాంతాలు నీటలోనే తేలుతున్నాయి. ఆటోనగర్‌ లోని వెయ్యి కుటుంబాలు గత నాలుగు రోజులుగా ఇళ్లకే పరిమితమయ్యాయి. పునరావాస కేంద్రాల్లో పెద్ద ఎత్తున బాధితుల చేరుకున్నారు. ఇంకా జలదిగ్బంధంలో పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం (padmavathi university flood)ఉంది.

కాస్త తగ్గుముఖం...పునరుద్ధరణ..

తూర్పు పోలీస్‌స్టేషన్‌ అండర్‌ బ్రిడ్జ్‌ వద్ద వరద నీరు కాస్త తగ్గుముఖం పట్టింది. నగరంలోని వెస్ట్‌ చర్చి అండర్‌ బ్రిడ్జ్‌ వద్ద వరద నీరు తగ్గింది. దీంతో రాకపోకలను తిరుపతి నగరపాలక సంస్థ పునరుద్ధరించింది.

పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం-రద్దు ...

తిరుపతి - ఆదిలాబాద్‌ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ను రైల్వే అధికారుల రద్దు చేశారు. నెల్లూరు-పడుగుపాడు మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రకాశం జిల్లా చీరాలలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. జిల్లాలోని వేటపాలెంలో పూరీ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కడప-తిరుపతి మార్గంలో ఆర్టీసీ అధికారులు రాకపోకలు నిలిపివేశారు.

రవాణా పునరుద్ధరణ...

తిరుమలకు రెండు ఘాట్‌ రోడ్‌ల ద్వారా ద్విచక్రవాహనాలు మినహా భక్తుల అనుమతినిచ్చింది. తిరుపతి విమానాశ్రయానికి (Tirupati Airport news 2021)విమానాల ద్వారా రాకపోకల పునరుద్ధరించారు. కడప-తిరుపతి మార్గంలో మినహా.. అన్ని మార్గాల నుంచి రాకపోకలను ఆర్టీసీ పునరుద్ధరించింది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.