శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో నాలుగోరోజైన మంగళవారం ఉదయం స్వామివారికి కల్పవృక్ష వాహనసేవ జరిగింది. ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామి కల్పవృక్ష వాహనంపై తలపాగ, జాటీతో గోవుల గోపన్నగా దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ అర్చకులు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కరోనా ప్రభావంతో ఉత్సవాలను అధికారులు ఆలయానికే పరిమితం చేశారు. కార్యక్రమంలో తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తదితరులు వాహన సేవలో పాల్గొన్నారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామివారికి సర్వభూపాల వాహనసేవ జరగనుంది.
ఇవీ చూడండి: