ETV Bharat / city

తిరుమలలో వారం పాటు దర్శనం నిలిపివేత - తిరుమలలో దర్శనం నిలిపివేత

వారంరోజుల పాటు తిరుమలలో దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వారం తర్వాత పరిస్థితులను సమీక్షించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. స్వామివారికి నిర్వహించే కైంకర్యాలన్నీ ఏకాంతంగా నిర్వహిస్తామని ప్రకటించారు.

tirumala temple vision stop due to corona

author img

By

Published : Mar 19, 2020, 7:44 PM IST

వారంరోజుల పాటు తిరుమలలో దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇప్పటికే తిరుపతి చేరుకుని టైమ్​స్లాట్ టోకెన్లు తీసుకున్నవారికి ఈరోజు రాత్రి దర్శనం కల్పించి.. అనంతరం దర్శనాలు నిలిపివేస్తామని చెప్పారు.

శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తుడికి కరోనా లక్షణాలు కనిపించటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ఈవో వెల్లడించారు. అతని రక్త నమూనాలను పరీక్షల కోసం పంపించామని.. రిపోర్టు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు. వారం తర్వాత పరిస్థితులను సమీక్షించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. స్వామివారికి నిర్వహించే కైంకర్యాలన్నీ ఏకాంతంగా నిర్వహిస్తామని ప్రకటించారు.

ఇవీ చదవండి:

తిరుమలలో భక్తునికి కరోనా లక్షణాలు..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.