ETV Bharat / city

IBPS Exam preparation tips : ఐబీపీఎస్​ పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలంటే.. - ఐబీపీఎస్​ పరీక్షకు సలహాలు

ఐబీపీఎస్‌ పోటీ పరీక్షల(IBPS Exam 2021)కు హాజరయ్యే అభ్యర్థులకు అనేక సందేహాలు వస్తుంటాయి. పీఓ, ఎస్‌ఓలలో ఏ పోస్టు మంచిది. రెండు పరీక్షలకూ హాజరుకావాలంటే సమయ విభజన ఎలా ఉండాలి. ఎలా సన్నద్ధం కావాలి... పరీక్ష విధానం, ఎంపిక ఎలా ఉంటాయి... ఇలా ప్రతి విషయంలోనూ ఎన్నో సందేహాలు వస్తుంటాయి. వీటికి సమాధానంతోపాటు ఎన్నో మెలకువలనూ అందిస్తున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందామా?

IBPS Exam preparation tips
IBPS Exam preparation tips
author img

By

Published : Nov 8, 2021, 9:40 AM IST

వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్‌(IBPS Exam notification 2021) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గత రెండు సంవత్సరాలతో పోలిస్తే పోస్టుల సంఖ్య పెరిగింది. 2019లో 647, 2020లో 1163 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ సంవత్సరం 1828 పోస్టులు భర్తీ అవనున్నాయి. మొత్తం 11 బ్యాంకుల్లో మూడు బ్యాంకులు మాత్రమే తమ ఖాళీల వివరాలను వెల్లడించాయి. ఇంకా ఎనిమిది బ్యాంకులు వాటిలో ఉన్న ఖాళీల సంఖ్యను పేర్కొనాల్సి ఉంది. కాబట్టి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది.

రెండిట్లో ఏది మెరుగు?

.

ఐబీపీఎస్‌ పీఓ(IBPS PO), ఐబీపీఎస్‌ ఎస్‌ఓ(IBPS SO)- రెండు పోస్టులకు ఎంపికైతే దేన్ని ఎంచుకోవాలి, రెండింటిలో ఏది మెరుగనే సందేహం సాధారణంగా అభ్యర్థులకు వస్తుంటుంది. రెండు పోస్టుల్లో దేని ప్రయోజనాలు దానికే ఉన్నాయి. జీతభత్యాలు దాదాపుగా ఒకే విధం. ప్రొబేెషనరీ ఆఫీసర్‌ బాధ్యతలు ఖాతాదారులతో నేరుగా సంబంధముండే విధంగా ఉంటాయి. స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌కు అవి తక్కువగా..ఎంపికైన పోస్టుకు తగిన విధంగా నిర్దిష్టంగా ఉంటాయి. పదోన్నతులు కూడా స్పెషలిస్ట్‌ ఆఫీసర్లకు దాదాపు స్కేల్‌-4 వరకు కాస్త వేగంగా ఉండి, ఆ తర్వాత కొద్దిగా నెమ్మదిస్తాయి. ప్రొబేెషనరీ ఆఫీసర్లకు ఉన్నత స్థాయి వరకు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. పీవోలకు పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైనా పనిచేసే అవకాశం ఉంటుంది. స్పెషలిస్ట్‌ ఆఫీసర్లకు ఎక్కువగా పట్టణ ప్రాంతాలలోనే తమ విధులను నిర్వర్తించే అవకాశం ఉంటుంది. ఇలా రెండింటిలో దేనికి దానికే అనుకూలతలున్నాయి. వాటిని అనుసరించి రెండింటిలో అవకాశం వచ్చినప్పుడు అభ్యర్థులు తమకు అనుకూలంగా ఉన్నదాన్ని ఎంచుకోవచ్చు. పీఓతో పోలిస్తే స్పెషలిస్ట్‌ ఆఫీసర్ల పోస్టులకు పోటీ తక్కువ.

దేనికి ఎక్కువ పోటీ?

బీపీఎస్‌ స్పెషలిస్ట్‌ ఆఫీసర్ల(IBPS Specialist Officer)లో భర్తీ చేయబోయే ఆరు పోస్టుల్లో సాధారణంగా అగ్రికల్చరల్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌, మార్కెటింగ్‌ ఆఫీసర్‌, ఐటీ ఆఫీసర్‌, హెచ్‌ఆర్‌/ పర్సనల్‌ ఆఫీసర్‌ పోస్టులకు మిగిలిన వాటితో పోలిస్తే పోటీ ఎక్కువగా ఉంటుంది. పోస్టుల సంఖ్య కూడా వీటిలోనే అధికంగా ఉంది.

.

ఎంపిక ఏ విధంగా?

పోస్టులన్నింటీకీ ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించే రెండంచెల రాత పరీక్ష, మౌఖిక పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొదటి అంచెలో నిర్వహించే ప్రిలిమినరీ రాత పరీక్ష అర్హత పరీక్ష. దీనిలో ఉత్తీర్ణత సాధించినవారిలో ఎక్కువ మార్కులు వచ్చిన వారిని పోస్టుల సంఖ్యకు తగిన విధంగా రెండో అంచెలోని మెయిన్స్‌ పరీక్షకు ఎంపిక చేస్తారు. దీనిలో అర్హత సాధించి తగినన్ని మార్కులు వచ్చినవారు మౌఖిక పరీక్షకు అర్హులవుతారు. మెయిన్స్‌ రాత పరీక్ష, మౌఖిక పరీక్షలో వచ్చిన మార్కులను 80 : 20 నిష్పత్తిలో తీసుకుని దాని ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక నిర్వహిస్తారు.

స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులకు సన్నద్ధత మెలకువలు

  • ప్రొబేెషనరీ ఆఫీసర్‌(Probationary Officer)తో పోలిస్తే స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ రాతపరీక్ష ప్రిపరేషన్‌ తేలికగా, తక్కువ సమయంలో పూర్తిచేసేలా ఉంటుంది. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసే పోస్టుకు సంబంధించిన ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ సబ్జెక్టును వారి డిగ్రీ/ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో చదివి ఉన్న కారణంగా దాని సన్నద్ధతకు తక్కువ సమయయే పడుతుంది. ఇక ప్రిలిమ్స్‌ పరీక్షలో ఉండే సబ్జెక్టులకు మాత్రమే వారి తయారీ ఎక్కువగా ఉండాలి.
  • ఏఎఫ్‌ఓ, ఐటీ, హెచ్‌ఆర్‌/ పర్సనెల్‌, మార్కెటింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల్లో ప్రిలిమ్స్‌ పరీక్షలో రీజనింగ్‌, ఇంగ్లిష్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ సబ్జెక్టులు, రాజభాషా అధికారి, లా ఆఫీసర్‌ పరీక్షలో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ బదులుగా జనరల్‌ అవేర్‌నెస్‌ సబ్జెక్టులు ఉన్నాయి.
  • ప్రిలిమ్స్‌ పరీక్ష 26 డిసెంబర్‌న జరుగనుంది. అంటే దాదాపు 50 రోజుల వ్యవధి ఉంది. ఈ సమయంలో ప్రిలిమ్స్‌ పరీక్షకు మాత్రమే సిద్ధమై తర్వాత మెయిన్స్‌ పరీక్షకు తయారయ్యే అవకాశం ఈ పరీక్షలో ఉంది.
  • ఆప్టిట్యూడ్‌లో ఎక్కువ మార్కులు వచ్చే నంబర్‌ సిరీస్‌, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌, సింప్లిఫికేషన్స్‌, డేటా ఇంటర్‌ ప్రిటేషన్‌లను మొదటిగా పూర్తిచేయాలి. ఆ తర్వాత అరిథ్‌మెటిక్‌లోని అంశాలను పూర్తిచేయాలి. అలాగే రీజనింగ్‌లో ఎక్కువ ప్రశ్నలు వచ్చే సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, పజిల్స్‌ టాపిక్స్‌ను మొదటగా పూర్తిచేయాలి. దీని నుంచి దాదాపు 50-60% ప్రశ్నలు వస్తాయి. ఆ తర్వాత ఎక్కువ నుంచి తక్కువ ప్రశ్నలు వచ్చే క్రమంలోని ఇతర టాపిక్స్‌ను పూర్తి చేసుకోవాలి.
  • ఇంగ్లిష్‌ విభాగంలో గ్రామర్‌ ఆధారంగా ఉండే ప్రశ్నలు ఎక్కువ. దానిలోని వివిధ రకాల ప్రశ్నలను పూర్వ ప్రశ్నపత్రాలను పరిశీలించి ఆయా మోడల్‌ ప్రశ్నలు బాగా సాధన చేయాలి. అదేవిధంగా రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ను కూడా బాగా అభ్యాసం చేయాలి. ఇలా ప్రాక్టీస్‌ చేస్తూ ప్రతిరోజూ ఒక మోడల్‌ పేపర్‌ను కూడా సమయాన్ని నిర్దేశించుకుని రాయాలి. దీనివల్ల సమయానికి తగినట్టు ప్రశ్నలు సాధించే పద్ధతి అలవాటవుతుంది.
  • సన్నద్ధత ఇప్పుడు మొదలుపెట్టినా కూడా విజయం సాధించడానికి ఈ సమయం సరిపోతుంది. తాము చదివిన ప్రొఫెషన్‌ నాలెడ్జి సబ్జెక్టు మెయిన్స్‌ పరీక్షలో ఉంది. దానికి ప్రిలిమ్స్‌ తర్వాత ఒక నెల సమయం ఉంటుంది. కాబట్టి ఆ సమయం దాని ప్రిపరేషన్‌కు సరిపోతుంది.
  • మొదటిసారి పరీక్ష రాసే అభ్యర్థులు మాత్రం పరీక్ష సన్నద్ధతకు తగిన విధంగా రోజులో గరిష్ఠ సమయాన్ని నిర్దేశించుకుని చాలా ఎక్కువగా శ్రమపడాల్సి ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.