ETV Bharat / city

యువ శాస్త్రవేత్త.. మనసులో మాట - కైండ్లీ యాప్

అమెరికాకు చెందిన ఓ భారత సంతతి బాలిక అరుదైన గుర్తింపు సాధించింది. కొలరాడోలోని లోన్‌ట్రీలో నివసిస్తోన్న గీతాంజలి రావు (15) సాంకేతిక పరిశోధనలను గుర్తించిన ప్రఖ్యాత టైమ్‌ పత్రిక.. ఈ యంగ్‌ సైంటిస్టును 'కిడ్‌ ఆఫ్‌ ది ఇయర్‌' గా గుర్తించింది. ఈ సందర్భంగా తన పరిశోధనలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుందీ యంగ్‌ గర్ల్‌.

time magazine kid of the year Young Girl shared many interesting things related to her personal life.
యువ శాస్త్రవేత్త.. మనసులో మాట
author img

By

Published : Mar 9, 2021, 8:21 PM IST

Updated : Mar 9, 2021, 8:28 PM IST

వయసుతో సంబంధం లేకుండా నేటి తరం యువత అన్నిరంగాల్లోనూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. సైన్స్‌, గణితం, శాస్త్ర సాంకేతికత... లాంటి ఎన్నో రంగాల్లో తమదైన ముద్రవేస్తూ కొత్త ఆవిష్కరణలకు తెరతీస్తున్నారు. ముఖ్యంగా భారతీయ మూలాలున్న వారు.. విదేశాల్లో తమదైన ప్రతిభతో మనదేశ కీర్తిని ఖండాంతరాలు దాటిస్తున్నారు. ఇందుకు ప్రతిఫలంగా పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకుంటున్నారు. ఇందుకు తాజా ఉదాహరణే 15 ఏళ్ల ఇండియన్‌ అమెరికన్‌ గీతాంజలి రావు. తన సాంకేతిక పరిశోధనలతో కలుషిత తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు తనదైన కృషి చేస్తోందీ యంగ్‌ గర్ల్‌. దీంతో పాటు సైబర్‌ వేధింపులు, డ్రగ్స్‌ వాడకం లాంటి సామాజిక సమస్యలను టెక్నాలజీతో చక్కదిద్దే ప్రయత్నం చేస్తోంది. ఈక్రమంలో తన సాంకేతిక పరిశోధనలను గుర్తించిన ప్రఖ్యాత టైమ్‌ పత్రిక ఈ యంగ్‌ సైంటిస్టును ‘కిడ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా గుర్తించింది.

5వేల మందితో పోటీ పడి!

వివిధ రంగాల్లో సత్తా చాటుతున్న యువతను ప్రోత్సహించేందుకు టైమ్‌ పత్రిక తొలిసారిగా ఈ ఏడాది 'కిడ్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డును ప్రవేశపెట్టింది. ఈనేపథ్యంలో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం కోసం మొత్తం 5వేల మంది పోటీ పడ్డారు. వారందరినీ కాదని కొలరాడోలోని లోన్‌ట్రీలో నివసిస్తోన్న గీతాంజలి ఈ అవార్డుకు ఎంపికైంది. ఈ క్రమంలో ప్రముఖ హాలీవుడ్‌ నటి ఏంజెలినా జోలీ తనను వర్చువల్‌గా ఇంటర్వ్యూ చేయడం విశేషం. ఈ సందర్భంగా తన పరిశోధనలతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుందీ యంగ్‌ గర్ల్‌.

అందరి ముఖాల్లో నవ్వు చూడాలనే!

'నాకు చిన్నప్పటి నుంచి సైన్స్‌ అంటే చాలా ఆసక్తి. సామాజిక మార్పు కోసం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీని ఎలా వాడాలన్న ఆలోచన నాకు రెండు, మూడు తరగతుల్లో ఉన్నప్పుడే మొదలైంది. వీటి సహాయంతో అందరి ముఖాల్లో సంతోషాన్ని నింపాలన్న ఆశయంతోనే ముందుకెళుతున్నాను. ప్రస్తుతం ప్రపంచం ఇంతకుముందెన్నడూ చూడని పలు సమస్యలను ఎదుర్కొంటోంది. కరోనా లాంటి కొత్త సమస్యలతో పాటు ఇప్పటికీ ఉన్న పాత సమస్యలు మా తరాన్ని వెంటాడుతున్నాయి. అంతేకాకుండా మానవ హక్కుల సమస్యలూ ఉన్నాయి. వీటన్నింటినీ మేం సృష్టించలేదు. కానీ సైన్స్‌తో వాటికి పరిష్కారం చూపగలం. ఉదాహరణకు కలుషితమైన నీరు తాగడం వల్ల చాలామంది ఓపియాడ్‌ లాంటి రుగ్మతల బారిన పడుతున్నారని మా పరిశోధనల్లో స్పష్టమైంది. దీంతో పాటు డ్రగ్స్ వాడకం, సైబర్‌ వేధింపులు.. తదితర సమస్యలను సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కరించవచ్చు.'

నేను చేశానంటే...మీలో ఎవరైనా చేయగలరు!

'గమనించడం, ఆలోచించడం, పరిశోధించడం, ఫలితం సాధించడం, సమాచారం ఇవ్వడం.. ఇదే నా ప్రయోగ విధానం. సమాజంలో కనిపించిన ప్రతి సమస్యనూ మనం పరిష్కరించలేం. ఏ సమస్య అయితే మనల్ని బాగా కదిలిస్తుందో దానిపైనే దృష్టి పెట్టాలి. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సృజనాత్మకత, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆసక్తి కనబరిచే యువతతో ఒక అంతర్జాతీయ బృందాన్ని ఏర్పాటు చేయాలన్నదే నా ఆశయం. మిగతా వారు కూడా ఈ పరిశోధనలపై దృష్టి పెట్టాలి. నేను చేయగలిగానంటే...మీలో ఎవరైనా చేయగలరు..' అని అందరిలో స్ఫూర్తి నింపిందీ యంగ్‌ సైంటిస్ట్‌.

అదే నా లక్ష్యం!

*తన పరిశోధనల్లో భాగంగా గతంలో 'కైండ్లీ' పేరుతో ఓ యాప్‌ను అభివృద్ధి చేసింది గీతాంజలి. కృత్రిమ మేధస్సు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అభివృద్ధి చేసిన ఈ యాప్‌ సహాయంతో సైబర్‌ వేధింపులను అరికట్టవచ్చంటోందీ టీనేజ్‌ సెన్సేషన్‌.

*ప్రతిష్ఠాత్మక 'టెడెక్స్‌' వేదికపై మూడుసార్లు ప్రసంగించిన గీతాంజలి.. 2017లో అమెరికా 'టాప్‌ యంగ్‌ సైంటిస్ట్‌' అవార్డును గెలుచుకుంది. అతి తక్కువ ఖర్చుతో తాగునీటిలో మలినాలను గుర్తించేలా ఆమె చేసిన పరిశోధనలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.

*అంతకుముందు 11 ఏళ్ల వయసులోనే ఫోర్బ్స్‌ ‘30 అండర్‌ 30’ జాబితాలో చోటు దక్కించుకుంది. ఇక రెండేళ్ల క్రితం 'యునైటెడ్‌ స్టేట్స్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ ప్రెసిడెంట్స్‌ యూత్‌ అవార్డు'ను కూడా తన కీర్తి కిరీటంలో చేర్చుకుంది.

*కలుషిత తాగునీటి సమస్యను పరిష్కరించడంలో గీతాంజలి చేస్తోన్న కృషికి గుర్తింపుగా ప్రఖ్యాత 'మార్వెల్‌' సంస్థ ఆమె పోలికలతో 'జీనియస్‌ గీతాంజలి' పేరుతో ఓ సూపర్‌ హీరో కార్టూన్‌ను రూపొందించడం విశేషం.

*ఎపిడెమియాలజిస్ట్‌ (వ్యాధుల వ్యాప్తి, అందుకు గల కారణాలపై పరిశోధన చేయడం) కావడమే తన లక్ష్యమంటోన్న ఈ యంగ్‌ గర్ల్‌కు ఖాళీ సమయాల్లో బేకింగ్‌ చేయడమంటే చాలా ఇష్టమట!

*తన సాంకేతిక పరిశోధనలకు గుర్తుగా తాజాగా టైమ్‌ పత్రిక నుంచి 'కిడ్‌ ఆఫ్‌ ది ఇయర్‌' పురస్కారం అందుకుంది గీతాంజలి. ఈ క్రమంలో డిసెంబర్‌ 14న రానున్న టైమ్‌ మ్యాగజైన్‌ కవర్‌ పేజీ ఆమె ముఖచిత్రంతో విడుదల కానుంది.

ఆమె స్ఫూర్తి అభినందనీయం!

ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా, బయోకాన్‌ ఛైర్‌ పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌షా, కేంద్ర మంత్రి శశిథరూర్‌, ప్రముఖ చెఫ్‌ వికాస్‌ ఖన్నా, ఐఎఫ్‌ఎస్‌ అధికారి ప్రవీణ్‌ కాస్వాన్‌...తదితరులు సోషల్‌ మీడియా వేదికగా గీతాంజలిని అభినందించారు. ఆమె తన ప్రతిభతో మరెందరికో స్ఫూర్తినిస్తుందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: మధుమేహులు పుచ్చకాయ తినొచ్చా?

Last Updated : Mar 9, 2021, 8:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.