ETV Bharat / city

Tiger in kakinada: 12 రోజులైనా కానరాని పులి జాడ... భయం గుప్పిట్లో ప్రజలు

Tiger in kakinada: ఏపీలోని కాకినాడ జిల్లాలో పెద్దపులి కలవరం రేపుతోంది. జనావాసాలకు పులి సమీపంలోనే సంచరిస్తుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పులి కోసం 12 రోజులుగా అధికారులు గాలిస్తున్నా... చిక్కడం లేదు.

Tiger
Tiger
author img

By

Published : Jun 3, 2022, 2:21 PM IST

Tiger in kakinada: ఏపీ కాకినాడ జిల్లాలో పెద్దపులి అలజడి ఇంకా కొనసాగుతూనే ఉంది. జనావాసాలకు దగ్గరగా పులి సంచరిస్తుండడంతో.. సమీప ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పట్టుకొని తిరుగుతున్నారు. ప్రత్తిపాడు మండలం పొదురుపాక సమీపంలో తిరుగుతున్న పులి.. 12 రోజులుగా గాలిస్తున్నా చిక్కకుండా అధికారులను ​ముప్పు తిప్పలు పెడుతోంది. జనాలను హడలెత్తిస్తోంది. నిన్న పొదురుపాకలో వేటాడిన ఆవు కళేబరం వద్దకు.. ఇవాళ మళ్లీ వచ్చిన పెద్దపులి.. ఆవు కళేబరాన్ని కొంతమేర తిని వెళ్లింది. శరభవరం సమీపంలో పెద్దపులి వేట నుంచి 2 గేదెలు తప్పించుకున్నాయి. పులి పశువులను వేటాడుతున్న తీరుతో గ్రామాల్లో అలజడి నెలకొంది. ఒమ్మంగి, పొదురుపాక, శరభవరం, పాండవులపాలెం, పోతులూరు గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఓ వైపు పులిని అడవుల్లోకి పంపేలా అటవీ శాఖ సిబ్బంది కసరత్తు చేస్తున్నారు. పెద్దపులి సంచారంతో పొలాల్లోకి వెళ్లేందుకు పరిసర గ్రామాల రైతులు భయపడుతున్నారు. పులిని ఎప్పుడు పట్టుకుంటారా? అని ఎదురుచూస్తున్నారు.

యంత్రాంగం ఉరుకులు: జూన్​ 2న పొదురుపాక సమీపంలోని పశువుల పాకపై పంజా విసిరింది. ఒక ఆవును వేటాడి సమీప తోటల్లోకి ఈడ్చుకెళ్లి, ఆవు మెడ భాగం కొంత తినేసి వెళ్లింది. రంగంలోకి దిగిన అధికారులు.. రిజర్వు ఫారెస్టు వైపు మళ్లిందనే అంచనాకు వచ్చేలోపే వెనుదిరిగి పంజా విసరడంతో గురువారం ఉదయం అటవీయంత్రాంగమంతా పొదురుపాక వైపు ఉరుకులు పెట్టింది. వైల్డ్‌లైఫ్‌ డీఎఫ్‌వో సెల్వం, జిల్లా అటవీ అధికారి ఐకేవీ రాజు, స్క్వాడ్‌ డీఎఫ్‌వో ఎన్వీ ప్రసాదరావు, ఏసీఎఫ్‌ సౌజన్య, రేంజరు వరప్రసాదరావు సిబ్బంది ఆవును వేటాడిన ప్రదేశం, పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. పోతులూరు నుంచి పొదురుపాకకు బేస్‌ క్యాంపు మార్చారు. పులిని పట్టి తరలించే వాహనాన్ని అక్కడే ఉంచారు. బోనులను పోతులూరు వద్ద సిద్ధంగా ఉంచారు.

ఎస్‌టీసీఏ బృందం రాక: పులి జాడ తెలిసినప్పటి నుంచి నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ) ఇక్కడి యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తోంది. ఆవును వేటాడిన నేపథ్యంలో ఎన్‌టీసీఏ ముగ్గురు సభ్యులతో కూడిన బృందం మండలానికి వచ్చింది. పులి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తోంది. పులిని బంధించే విషయమై డీఎఎఫ్‌వో ఛైర్మన్‌గా వైల్డ్‌లైఫ్‌ డీఎఫ్‌వో, ఎన్టీసీఏ ప్రతినిధి, పశుసంవర్ధక ఏడీ, సర్పంచితో కూడిన బృందం రోజువారీ పరిణామాలను ఇక్కడి పరిస్థితులను ఉన్నత వర్గాలకు నివేదించి నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు.

నిశితనిఘా..: పులి సంచరించే వీలున్న మార్గాల్లో 40 కెమెరా ట్రాప్‌లు ఏర్పాటుచేసి నిఘా వేశారు. ఒమ్మంగి, పోతులూరు, కొడవలి మధ్య సంచరించి ఊదరేవడి మెట్టపై బస చేసిన పెద్దపులికి నాలుగైదేళ్లు వయసు ఉండొచ్చని అంచనా. 180 కేజీలకు పైనే బరువు.. ఆరున్నర అడుగుల పొడవు ఉంటుందని చెబుతున్నారు. వేటాడే క్రమంలో దారి తప్ఫి. విజయనగరం జిల్లా ఎస్‌.కోట - అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మీదుగా వందల కిమీ ప్రయాణించి ఇటు వచ్చినట్లు గుర్తించారు. ఒమ్మంగి సమీపంలో రెండు గేదెలను వేటాడిన పులి.. ఆహార అన్వేషణకు అనుకూలతతో ఊదరేవడి మెట్టపైనే మకాం పెట్టినట్లు భావిస్తున్నారు. మెట్టకు 6 కి.మీ. దూరంలో పాండవులపాలెం వైపు వెళ్లిందని బుధవారం కన్పించిన పాదముద్రల ఆధారంగా తెలుస్తోంది. అక్కడికి సమీపంలో అభయారణ్యం ఉండడంతో బెబ్బులి గమనం అటువైపు ఉంటుందా.. ఆహారం రుచి మరిగిన పులి వెనక్కి వస్తుందా అనే భయాందోళన నెలకొంది.

క్షణక్షణం..: పులి సంచారంతో సమీప ఆరు గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. జాతీయ జంతువు కావడంతో నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ) మార్గదర్శకాల ప్రకారం కమిటీ ఏర్పాటుచేసి.. రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభించాలి. కమిటీ ఏర్పాటు చేసినా.. పరిస్థితి చేయిదాటితేనే రెస్క్యూ ఆపరేషన్‌ వరకు వెళ్లే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. కెమెరా ట్రాప్‌ల ద్వారా కదలికలపై నిశిత నిఘా వేశారు. పులికి ఎలాంటి హాని కలగకుండా అడవి వైపు గమనం సాగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పాండవులపాలెం సమీపంలో చెరువు వద్ద పులి పాదముద్రలు గుర్తించిన అధికారులు దాదాపు అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లేనని భావిస్తున్నామని వన్యప్రాణుల సంరక్షణ విభాగం డివిజనల్‌ అధికారి సెల్వం చెప్పారు. మరికొద్దిరోజులు నిశిత పరిశీలన తర్వాత స్పష్టతకు వస్తామన్నారు.

మే 23: ఒమ్మంగి సమీపంలోని సరుగుడు తోటల్లో రెండు గేదెలు వేర్వేరు రోజుల్లో చనిపోయినట్లు గుర్తింపు. అడవి జంతువులు చంపేసినట్లు అనుమానంతో అటవీ అధికారులకు రైతుల ఫిర్యాదు.

మే 24: గేదెను వేటాడిన తీరు, పాదముద్రల ఆధారంగా క్రూర మృగమని అంచనా. నిఘా కెమెరాల ఏర్పాటు.

మే 25: పులి సంచారంపై చుట్టుపక్కల గ్రామాల్లో కలకలం.

మే 26: పులి సంచరించే వీలున్న మార్గాల్లో కెమెరా ట్రాప్‌ల అమరిక.

మే 27: పోతులూరు ఊదరేవడి మెట్ట వద్ద గేదెను చంపిన పులి. పర్యవేక్షణకు అటవీశాఖ ప్రత్యేక బృందాల నియామకం.

మే 28: పోతులూరు పరిసరాల్లో పెద్ద పులి సంచరిస్తున్న దృశ్యాలు నిఘా కెమెరాల్లో నిక్షిప్తం.

మే 29: డీఎఫ్‌వో రాజు, వన్యప్రాణి సంరక్షణ విభాగం డీఎఫ్‌వో సెల్వం, శిక్షణ ఐఎఫ్‌ఎస్‌ భరణి ఆధ్వర్యంలో 150 మంది సిబ్బందితో కొడవలి పంపు హౌస్‌ వద్ద బేస్‌ క్యాంపు ప్రారంభం.

మే 30: పెద్దపులి కదలికలు సీసీ కెమెరాల్లో మళ్లీ నిక్షిప్తం. ధర్మవరం సమీప పోలవరం కాలువ వరకు వెళ్లి, వెనక్కి మెట్ట దగ్గరకు వచ్చినట్లు గుర్తింపు.

మే 31: పోతులూరు ఊదరేవడిమెట్టపై మకాం వేసిన పెద్దపులి జాడ ట్రాకింగ్‌ కెమెరాల్లో కనిపించలేదు.

జూన్‌ 1: బెంగాల్‌ రాయల్‌ టైగర్‌గా గుర్తింపు. పాండవులపాలెం సమీప చెరువు వద్ద పులి పాదముద్రల గుర్తింపు. తోటపల్లి, బవురువాక రిజర్వ్‌ అటవీ ప్రాంతాలు ఉండటంతో అటు వెళ్లినట్లు అంచనా.

జూన్​ 2: పాండవులపాలెం-పొదురుపాక సమీపంలో మళ్లీ పశువులపై పులి దాడి చేసి... ఆవును చంపింది.

జూన్​ 3: పొదురుపాకలో వేటాడిన ఆవు కళేబరం వద్దకు మళ్లీ వచ్చన పెద్దపులి... ఆవు కళేబరాన్ని కొంతమేర తినేసి వెళ్లింది.

అడవిబాటలో: పెద్దపులి జాడలు పాండవులపాలెం వద్ద గుర్తించారు. తాజాగా పాండవులపాలెం చెరువు వద్దకు నీళ్ల కోసం వచ్చినట్లు పులి పాదముద్రలను అటవీఅధికారులు ట్రాకింగ్‌ కెమెరాల్లో గుర్తించారు. చీఫ్‌ కన్జర్వేటర్‌ శరవణన్‌, డీఎఫ్‌వో రాజు నేతృత్వంలోని బృందాలు పొదురుపాక, పాండవులపాలెం పరిసరాలు నిశితంగా పరిశీలించాయి. ఎండ కారణంగా ఎక్కడా నేల చెమ్మ లేకపోవడం వల్ల చెరువు వద్ద మాత్రమే పులి జాడ గుర్తించగలిగామని వైల్డ్‌లైఫ్‌ రేంజరు వరప్రసాద్‌ తెలిపారు. పోతులూరు ఊదరేవడి మెట్ట నుంచి 5 కి.మీ. దూరం కనిపించిన ఈ జాడలు రిజర్వుఫారెస్టుకు చేరువలోనే ఉన్నాయి. పాండవులపాలెం గ్రామానికి కిలోమీటరు దూరంలో తోటపల్లి రిజర్వుఫారెస్టు, 3 కి.మీ.ల బవురువాక రిజర్వు ఫారెస్టు ఉన్నాయి. పులి వచ్చినబాటనే వెళ్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వెనక్కి వచ్చే అవకాశం ఉండదని, గురువారం పులి జాడను బట్టి స్పష్టత వస్తుందని అన్నారు. ఫారెస్ట్‌ సబ్‌డీఎఫ్‌వో సౌజన్య నేతృత్వంలో డీఆర్‌వో రామకృష్ణ, సెక్షన్‌ ఆఫీసర్‌ రవిశంకర్‌ నాగ్‌, గోకవరం, అడ్డతీగల సిబ్బంది గ్రామాల్లో గస్తీ కాస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.