తెలంగాణ పోలీస్ శాఖలో కీలక మార్పు జరిగింది. నిఘా(ఇంటెలిజెన్స్) విభాగాధిపతిగా అదనపు డీజీపీ అనిల్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1996 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అనిల్‌కుమార్ ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్‌లో అదనపు కమిషనర్(ట్రాఫిక్)గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఐజీగా అక్కడ విధుల్లో చేరిన ఆయన.. అక్కడే అదనపు డీజీగా పదోన్నతి పొంది కొనసాగుతున్నారు.
ప్రభాకర్‌రావు స్థానంలో...
ఇప్పటివరకు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఓఎస్డీ ప్రభాకర్‌రావు పూర్తిఅదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు. పోలీస్‌శాఖలో 14 నెలల క్రితం ఐజీ హోదాలో.. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ) విభాగాధిపతిగా పనిచేస్తూ ప్రభాకర్‌రావు పదవీ విరమణ పొందారు. అనంతరం ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని మూడేళ్లపాటు పొడిగించి, ఎస్‌ఐబీలోనే ఓఎస్డీగా నియమించింది. తర్వాత కొద్ది రోజులకే అప్పటి నిఘా విభాగాధిపతి నవీన్‌చంద్ పదవీ విరమణ పొందడంతో.. ప్రభాకర్‌రావుకే ఆ అదనపు బాధ్యతలు అప్పగించింది. ఓఎస్డీ హోదాలో ఉన్న ఒక విశ్రాంత ఐపీఎస్ అధికారికి కీలకమైన నిఘా విభాగం బాధ్యతలు అప్పగించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అలా దాదాపు ఏడాదిపాటు ఆయన ఇటు నిఘా విభాగాధిపతిగా.. అటు ఎస్‌ఐబీ చీఫ్‌గా కొనసాగారు. తాజాగా ప్రభుత్వ ఆకస్మిక నిర్ణయంతో ఆయన ఎస్‌ఐబీ ఓఎస్డీగా మాత్రమే కొనసాగనున్నారు. వాస్తవానికి నిఘా విభాగాధిపతిగా ఐజీ స్థాయి అధికారినే నియమిస్తుండగా.. అనిల్‌కుమార్ అదనపు డీజీ హోదాలో విధుల్లో చేరనున్నారు.
ఇదీ చదవండి: భవిష్యత్‌లో... బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలబంధు: కేసీఆర్