ETV Bharat / city

పోస్కో ఒప్పందంతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌కే ముప్పు! - విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వార్తలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమం ఉద్ధృతమవుతున్నా.. కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఒకవేళ కార్మికుల ఆందోళనతో కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే... పోస్కోతో విశాఖ ఉక్కు కర్మాగారం చేసుకున్న ఒప్పందం మళ్లీ తెరపైకి రానుంది. ఈ ఒప్పందంలోని నిబంధనలు ఉక్కు కర్మాగారం పుట్టి ముంచేలా ఉన్నాయని తెలుస్తోంది.

vishaka steel plant
విశాఖ ఉక్కు కర్మాగారం
author img

By

Published : Feb 28, 2021, 7:42 AM IST

ఏపీలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయం వాయిదాపడినా.. స్టీల్‌ప్లాంట్ మెడపై మరో కత్తి వేలాడుతోంది. గతంలో పోస్కో సంస్థతో చేసుకున్న ఒప్పందం ఉక్కుకర్మాగారం పుట్టి ముంచేలా ఉంది. ఒప్పందం ప్రకారం విశాఖ ఉక్కు- పోస్కో సంయుక్తంగా ఏర్పాటు చేసే సంస్థలో కనీసం 50శాతం వాటా పోస్కో సంస్థకే ఉంటుంది. అయితే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వాటా ఎంత అన్నది మాత్రం ఒప్పందంలో ప్రస్తావించలేదు. నూతన సంస్థకు కేటాయించే భూమి విలువను బట్టి వాటా శాతం ఉంటుందనడం గమనార్హం. అవసరాన్ని బట్టి పోస్కో సంస్థ స్టీల్‌ప్లాంట్‌ ఆమోదంతో నూతన సంస్థలో మూడో వాటాదారుడిని చేర్చుకోవచ్చు. అప్పుడు ఆ సంస్థలో ప్రైవేట్‌ పెత్తనమే ఎక్కువ ఉండే అవకాశం ఉంది.

పోస్కో చెప్పినట్లుగానే ఉత్పత్తుల తయారీ

నూతన కర్మాగారంలో ఉత్పత్తి చేసే హట్‌రోల్ట్‌... మహారాష్ట్రలోని పోస్కో కర్మాగారానికి విక్రయించడానికి ప్రాధాన్యమిచ్చేలా హక్కు కల్పించాలని ఒప్పందంలో పేర్కొన్నారు. మహారాష్ట్రలోని పోస్కో సంస్థ అవసరాలకు తగినట్లుగా ఉత్పత్తులను రూపొందించి ఇవ్వాలని నిబంధనల్లో పెట్టారు. మార్కెట్ స్థితిగతులు, లాభదాయకతను బట్టి కాకుండా... సంస్థకు నష్టదాయకంగా ఉండేలా ఉత్పత్తులు తయారు చేసేలా ఒప్పందం కుదుర్చుకోవడం ఏమిటో అర్థం కావడం లేదు. నూతన కర్మాగారానికి 1,167 ఎకరాలు భూమి ఇవ్వడానికి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రతిపాదించింది. అవసరానికి తగ్గట్లుగా అదనపు భూమి ఇవ్వాల్సి ఉంటుందని నిబంధనను పొందుపరిచారు. పైగా ఉక్కు సంస్థలో భూమి విలువను ఖరారు చేసేందుకు స్టీల్‌ప్లాంట్‌కు సంబంధం లేని నిపుణుడి సేవలు పొందుతారు. అంటే తన భూమి విలువను నిర్ణయించుకునే హక్కు కూడా కర్మాగారం కోల్పోయినట్లే.

సంయుక్తంగా ఏర్పాటు చేసే కొత్త పరిశ్రమకు విద్యుత్, నీటి సౌకర్యాలు, రహదారుల వినియోగం, నౌకాశ్రయ, రైల్వే రవాణా, కేంద్ర పర్యావరణ తదితర అనుమతులకు విశాఖ ఉక్కు కర్మాగారమే తీసుకురావాలని ఒప్పందంలో రాశారు. విశాఖ ఉక్కు కర్మాగారం- పోస్కో సంస్థలు 2019 అక్టోబర్ 23న ఒప్పందం చేసుకున్నాయి. రెండేళ్లపాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుందని... అవసరమైతే మరో ఏడాది పొడిగించుకునేలా రాసుకున్నాయి. ఒప్పంద వివరాలు రహస్యంగా ఉంచాలని... పరస్పర అనుమతి లేకుండా బహిర్గతం చేయకూడదని నిబంధన పెట్టారు. అయితే ఒప్పందం గురించి తమకు ఏమీ తెలియదని ఇన్నాళ్లు అధికారులు చెబుతూ వస్తుండగా ఈ ఒప్పందంలో ఓ కీలక అధికారి సంతకం చేయడం గమనార్హం. నూతన కర్మాగారంలో ఏడాదికి 7 లక్షల నుంచి 10 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయనున్నారు. అవసరమైతే పరస్పర అంగీకారంతో ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునేలా నిబంధనలు రూపొందించారు. అంత భారీమొత్తంలో ఉక్కు ఉత్పత్తి చేస్తే...విశాఖ ఉక్కు కర్మాగార భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలు ప్రశ్నార్థకంగా మారతాయి.

పోస్కో ఒప్పందంతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌కే ముప్పు!

అధికారులు ఏమంటారంటే..

పోస్కో ఒప్పందం ప్రస్తుత స్థితి ఏమిటో తమకు తెలియదని అధికారులు చెబుతున్నారు. వందశాతం ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో పాత ఒప్పందం అమలవుతుందా లేదా అన్నది చెప్పలేమంటున్నారు.

ఇదీ చదవండి: రామగుండం ఎరువుల పరిశ్రమలో ట్రయల్‌రన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.