ETV Bharat / city

అక్రమంగా ఇళ్ల నిర్మాణం .. ఇప్పుడవే ముంపు కాలనీలుగా రూపాంతరం - illegal constructions in Hyderabad

హైదరాబాద్​లో చెరువులను ఆనుకుని చాలా కాలనీలు అక్రమంగా వెలిశాయి. ఇలా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ కాలనీలే కాస్త చినుకు పడితే చాలు.. మునిగిపోతున్నాయి. ఇలాంటి అక్రమ నిర్మాణాలు గుర్తించి వాటిని తొలగించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దాదాపు 50వేల ఇళ్లున్నాయి. అవన్నింటిని తొలగించడం ఎలా సాధ్యమవుతుందని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

అక్రమంగా ఇళ్ల నిర్మాణం
అక్రమంగా ఇళ్ల నిర్మాణం
author img

By

Published : Jul 24, 2021, 7:31 AM IST

రామంతాపూర్‌ చెరువులోని తూములు

ఈ అంతరచిత్రంలో ఉన్నవి రామంతాపూర్‌ చెరువులోని తూములు. చెరువు నిండి తూముల వరకు నీరు వస్తే.. వెనక ఉన్న కాలనీ నీట మునుగుతుంది. దీంతో తూముల వరకు నీరు రాకముందే.. పెద్దమోటారు.. ఇనుప పైపు ద్వారా చెరువులోని నీటిని తోడేస్తున్నారు. ఇలా తోడిన నీటిని రోడ్డు కింద ఉన్న నాలాలోకి వదులుతున్నారు.

భాగ్యనగరంలో చెరువులను ఆనుకొని ఎన్నో కాలనీలు వెలిశాయి. తటాకాల లోపల.. ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనూ వేలాది ఇళ్లు నిర్మితమయ్యాయి. ఇలా అక్రమంగా నిర్మాణాలు జరుగుతుంటే స్థానిక అధికారులు కళ్లు మూసుకున్నారు. ఇప్పుడా కాలనీలే చిన్నపాటి వర్షానికి మునిగిపోతున్నాయి. మహానగరం నలువైపులా ఇలాంటి గృహాలు కనీసం 50 వేల వరకు ఉంటాయని అధికారుల అంచనా. లోతట్టు ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. వేలాది మంది నివసిస్తున్న ఆ ఇళ్లను తొలగించడం సాధ్యమా...కాని పక్షంలో ఏం చేయాలన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

మహా నగరంలో కొన్నేళ్ల కిందటి వరకు 800 చిన్నా పెద్దా చెరువులుండేవి. ఇందులో చాలా వరకు ఆక్రమణల చెరలోకి వెళ్లిపోయాయి. కొన్నింటి ఉనికి కూడా లేదు. ప్రస్తుతం 188 చెరువులు మాత్రమే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో కూడా ఇదే విధమైన పరిస్థితి ఉంది. ఈ రెండు జిల్లాల్లో ఇప్పుడు 1446 చెరువులున్నాయి. నిబంధనల ప్రకారం చెరువులోగానీ, దాని ఎఫ్‌టీఎల్‌ పరిధిలోగానీ ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు. కానీ గత 20 ఏళ్లుగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా అక్రమార్కులు చెరువుల భూముల్లో వెంచర్లు వేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఎఫ్‌టీఎల్‌లో కాలనీలు వెలిశాయి. ఇప్పుడీ ప్రాంతాలన్నీ నాలుగైదు సెంటీమీటర్ల వర్షం పడితే చాలు మునుగుతున్నాయి. దీనికి ఉదాహరణ జీడిమెట్ల ఫాక్స్‌సాగర్‌ చెరువు ఎఫ్‌టీఎల్‌లో నిర్మితమైన ఉమామహేశ్వరనగర్‌ కాలనీ. గతేడాది అక్టోబర్‌ నుంచి ఈ కాలనీ ముంపు నీటిలోనే ఉంది. ఇలా అనేక కాలనీల్లో జనం ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు.

ఇప్పుడేం చేయాలబ్బా!

ముంపు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో ఏం చేయాలో అధికారులకు తోచడం లేదు. వేలాది అక్రమ ఇళ్లను ఒకేసారి తొలగించే పరిస్థితి లేదు. చెరువు గర్భంలో కట్టిన ఇళ్లను తొలగించే విషయంపై పరిశీలన చేయాలని అధికారులు అనుకుంటున్నారు.అనేక చెరువుల మధ్య గొలుసు కట్టు నాలాలు లేకపోవడం వల్లే కాలనీలు మునిగిపోతున్నాయి. ఈ గొలుసు కట్టును ఏర్పాటు చేయాలంటే కనీసం రూ.1000 కోట్ల వరకు అవసరం అవుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇన్ని నిధులను వ్యయం చేసే పరిస్థితి లేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.

ఎంత అక్రమం..!

  • ఫాక్స్‌సాగర్‌ చెరువు బఫర్‌ జోన్‌లో ఏర్పడిన ఉమామహేశ్వరనగర్‌ కాలనీలో 700 ఇళ్లు ఉండగా రెండువేల మంది నివసిస్తున్నారు. గత అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు చెరువు పొంగి కాలనీ పూర్తిగా నీట మునిగింది. ఇప్పటికీ అక్కడ అలానే ఉంది.
  • మల్కాజగిరిలోని బండచెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో షిర్డీనగర్‌లోని 100 ఇళ్లు ఉండగా, నాగోల్‌ బండ్లగూడ చెరువు ఎఫ్‌టీఎల్‌లో అయ్యప్పకాలనీ, మల్లికార్జున్‌నగర్‌ కాలనీల్లో చాలా భాగం ఉన్నాయి. ఇక్కడ 380 గృహాలు చిన్నవానకే మునుగుతున్నాయి.
  • రామంతాపూర్‌ పెద్ద చెరువు, ఉప్పల్‌ నల్లచెరువు కింద కూడా అనేక కాలనీల్లోని ఇళ్లు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనికే వస్తున్నాయి.
  • జల్‌పల్లి పరిధిలో బురాన్‌ఖాన్‌ చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనే ఉస్మాన్‌నగర్‌ ఏర్పడింది. షాహిన్‌నగర్‌లో కూడా కొన్ని ఇళ్లు ఉన్నాయి. 350 గృహాలు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నాయి. ఈ కాలనీలు నీట మునిగాయి.
  • హయత్‌నగర్‌ బాతులచెరువు ఎఫ్‌టీఎల్‌లోని అంబేడ్కర్‌నగర్‌లో 320 ఇళ్లు ముంపు బారిన పడ్డాయి. గగన్‌పహాడ్‌ అప్పా చెరువు కింద ఎఫ్‌టీఎల్‌ స్థలాన్ని లేఅవుట్‌ చేసి అమ్మేశారు.

ఇదీ చదవండి : DOST: నేటితో ముగియనున్న మొదటి విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.