ETV Bharat / city

కిడ్నాప్​ కేసులో మూడో రోజు అఖిలప్రియ విచారణ - kidnap case latest news

కిడ్నాప్​ కేసులో ప్రధాన నిందితురాలు మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసులు ఇవాళ మూడో రోజు విచారించనున్నారు. ఆమెతో పాటు అదుపులోకి తీసుకున్న మరో 8 మందిని సైతం పూర్తిస్థాయిలో ప్రశ్నించనున్నారు. వీరంతా... గ్యాంగ్​ సినిమా చూసి బాధితులను ఎలా కిడ్నాప్​ చేశారన్న వివరాలు ఆరా తీయనున్నారు.

third day of akhila priya enquiry about kidnap

author img

By

Published : Jan 13, 2021, 7:42 AM IST

బోయినపల్లి అపహరణ కేసులో ప్రధాన నిందితురాలు మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసులు ఇవాళ మూడో రోజు విచారించనున్నారు. అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ ఎక్కడున్నాడు..? కిడ్నాప్‌కు కుట్ర ఎలా పన్నారు..? తదితర అంశాలపై మరింత లోతుగా విచారించనున్నారు. పోలీసుల ప్రశ్నలకు తనకు ఏమీ తెలియదని అఖిలప్రియ సమాధానం ఇవ్వడం వల్ల... ఇవాళ మరింత లోతుగా ఆమెను ప్రశ్నించనున్నారు.

ఈ కేసులో గోవా, విజయవాడ, గుంటూరులో మరో 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... నిందితులను పూర్తిస్థాయిలో విచారించనున్నారు. అపహరణకు సంబంధించి వీరంతా... 'గ్యాంగ్‌' చిత్రం చూసి ఏ విధంగా ఐటీ అధికారులుగా నటించారు..? బెదిరింపులకు గురిచేసి మరీ ఎలా బాధితులను కిడ్నాప్‌ చేశారు..? వంటి అంశాలపై పోలీసులు వారిని ప్రశ్నించనున్నారు.

ఇదీ చూడండి: పండగ సందడి షురూ.. ఛార్జీల మోత మోగనుంది గురూ..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.