ETV Bharat / city

మెట్రో ఛార్జీల రాయితీలకు టాటా - telangana varthalu

ప్రయాణ ఛార్జీల రాయితీలకు మెట్రో ముగింపు పలికేసింది. మూడు నెలల కాలానికి ప్రవేశపెట్టిన పలు పథకాలు ముగిశాయి. మరికొంత కాలం పొడిగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. మెట్రో అందుకు సుముఖంగా లేదు.

మెట్రో ఛార్జీల రాయితీలకు టాటా
మెట్రో ఛార్జీల రాయితీలకు టాటా
author img

By

Published : Jan 17, 2021, 11:14 AM IST

ప్రయాణ ఛార్జీల రాయితీలకు మెట్రో టాటా చెప్పేసింది. మూడు నెలల కాలానికి ప్రవేశపెట్టిన పలు పథకాలు శుక్రవారంతో ముగిశాయి. మరికొంతకాలం పొడిగించాలని ప్రయాణికులు కోరుతున్నా ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో అందుకు సుముఖంగా లేదు. మెట్రోరైలు స్మార్ట్‌కార్డు రీఛార్జ్, ట్రిప్‌ పాసులపై 40 శాతం నగదును వెనక్కి ఇచ్చేలా అక్టోబరు 17న ప్రారంభించిన ప్రయాణికుల రాయితీ పథకాలు జనవరి 15తో ముగిశాయి. స్మార్ట్‌కార్డుపై మొదటి నుంచి ఇస్తున్న 10 శాతం రాయితీ యథాతథంగా కొనసాగుతుందని మెట్రో వర్గాలు తెలిపాయి.
కొవిడ్‌ లాక్‌డౌన్‌ అనంతరం సెప్టెంబరు 7న హైదరాబాద్‌ మెట్రోరైళ్లు పునఃప్రారంభం అయ్యాయి. ప్రయాణికుల సంఖ్యను పెంచుకునేందుకు మెట్రో నాలుగు పథకాలతో ముందుకొచ్చింది. అక్టోబరు 31వరకు ప్రయాణికుల టిక్కెట్లపై ఫ్లాట్‌ 40 శాతం తగ్గింపు ఇచ్చింది. మియాపూర్‌ నుంచి ఎల్‌బీనగర్‌కు ప్రయాణ ఛార్జీ రూ.60కి బదులు రూ.36 వసూలు చేసింది. ఆ తర్వాత నవంబరు 1 నుంచి ప్రయాణికులు ఎవరైనా 20 ట్రిప్పుల టిక్కెట్లు కొంటే.. అదనంగా 10 ట్రిప్పులు ఉచితంగా ఇచ్చింది.. యాప్‌లోనూ ఈ సదుపాయం కల్పించింది. ఈ రెండింటితో పాటూ స్మార్ట్‌కార్డు రీఛార్జ్‌పై 40 శాతం నగదు వెనక్కి ఇచ్చింది. ఎక్కువ మంది ప్రయాణికులు ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారు. ఇదివరకు స్మార్ట్‌కార్డుపై 10 శాతం రాయితీ ఉంది. ఈ రెండు కలిపి 50 శాతం తగ్గింపు ఇచ్చింది. స్మార్ట్‌కార్డుతో సగం ధరకే ప్రయాణించారు. కొవిడ్‌ సమయంలో మెట్రో ప్రయాణమే చౌకగా ఉండటంతో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో వినియోగించుకున్నారు.

నిరాశే మిగిలింది..

మెట్రోలో రాయితీ పథకాల అనంతరం ప్రయాణికుల సంఖ్య రెండింతలు పెరిగింది. రాయితీకి ముందు అక్టోబరులో రోజువారీ సగటు ప్రయాణికుల ట్రిప్పులు 80వేలుగా ఉండేవి. ఇటీవల ఈ సంఖ్య 1.70 లక్షలకు చేరింది. అన్‌లాక్‌ అనంతరం కార్యకలాపాలు ఊపందుకోవడంతో పాటూ ప్రయాణ ఛార్జీల్లో రాయితీలు ఇందుకు దోహదం చేశాయి. అయితే విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో పాఠాలు వినడం, ఆన్‌లైన్‌లో పనిచేస్తుండటంతో అనుకున్నంత స్థాయిలో ప్రయాణికులు పెరగలేదు. నాలుగు నెలలు దాటినా రెండు లక్షల మార్క్‌ను చేరుకోకపోవడంతో మెట్రోకి ఒకింత నిరాశే మిగిలింది. దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే దిల్లీ తర్వాత హైదరాబాద్‌ మెట్రోలో ఎక్కువ మంది ప్రయాణిస్తుండటం ఒక్కటే కొంత ఊరట.

మునుపటి సంఖ్యను చేరేదెప్పుడు?..

కొవిడ్‌ ముందు రోజువారీ సగటు ట్రిప్పులు 4.5 లక్షలు ఉండేవి. ఈ సంఖ్యను చేరుకునేందుకు మరో ఆరు నెలలైనా ఎదురుచూపులు తప్పేలా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికుల సంఖ్యను మరింత పెంచుకునేందుకు మరికొన్నాళ్లు ఛార్జీల తగ్గింపు పథకాలు కొనసాగించాలనే డిమాండ్లు వస్తున్నాయి.

ఇదీ చదవండి: ఇస్రోలో ఉద్యోగం సాధించడం ఎలా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.