ఈ నెల 31న నైరుతి రుతు పవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు ఉపరితల ద్రోణి తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ వరకు సముద్రమట్టానికి 1.5కిలో మీటర్ల నుంచి 2.1కిలో మీటర్ల మధ్య ఏర్పడిందని తెలిపింది. దీని ప్రభావంతో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం మీదుగా బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది.
రాగల మూడ్రోజులు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(telangana rains) కురిసే అవకాశముందని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.
- ఇదీ చదవండి వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష