మధ్యప్రదేశ్ పశ్చిమ ప్రాంతం నుంచి కర్ణాటక ఉత్తర ప్రాంతం వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఆదివారం నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.
శనివారం ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో గాలిలో తేమ సాధారణంకన్నా 23 శాతం వరకు అదనంగా పెరిగింది. ప్రజలు ఉక్కపోతలతో ఇబ్బందులు పడ్డారు
- ఇదీ చదవండి గ్రామాల్లో విరుచుకుపడుతున్న కొవిడ్ వైరస్