ETV Bharat / city

వాచ్​మెన్​ను కట్టేసి.. రూ.4 కోట్ల విలువైన ఆభరణాలు చోరీ

ఏపీలోని విజయవాడ కాటూరివారి వీధిలో పట్టపగలే దొంగతనం జరిగింది. ఓ నగల దుకాణం వాచ్​మెన్​ను కట్టేసి.. నాలుగు కోట్ల విలువైన నగలు, కొంత నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల గాలింపు కోసం ఐదు బృందాలను రంగంలోకి దించినట్లు డీసీపీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.

thieft in vijayawada
వాచ్​మెన్​ను కట్టేసి.. రూ.4 కోట్ల విలువైన ఆభరణాలు చోరీ
author img

By

Published : Jul 24, 2020, 9:34 PM IST

విజయవాడలో పట్టపగలే భారీ చోరీ జరిగింది. సుమారు రూ. 4 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును దోచేశారు. బంగారు దుకాణం వాచ్‌మెన్‌ను బంధించి చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన వాచ్‌మెన్‌ను ఆసుపత్రికి తరలించారు.

సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించిన పోలీసులు.. నిందితుల కోసం ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. తెలిసినవారే ఈ చోరీకి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీచూడండి: సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.