ETV Bharat / city

ఏపీలో కరోనాతో కళ తప్పిన తుంగభద్ర పుష్కరాలు..

తుంగభద్ర పుష్కరాలను కరోనా భయం వెంటాడుతోంది. మహమ్మారి దెబ్బకు భక్తులు పెద్దగా హాజరుకావడం లేదు. పుష్కర విధులు నిర్వహిస్తున్న ఐదుగురు సిబ్బందికి వైరస్‌ సోకడం మరింత ఆందోళన కల్గిస్తోంది. నీటి కొరతకు తోడు.. వసతులలేమి ఇబ్బందిగా మారింది.

the-tungabhadra-pushkars-ended-on-the-4th-day
కరోనాతో కళ తప్పిన తుంగభద్ర పుష్కరాలు
author img

By

Published : Nov 24, 2020, 11:15 AM IST

ఏపీలోని కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కరాలకు భక్తుల నుంచి ఆశించిన మేర స్పందన లేదు. జిల్లా వ్యాప్తంగా 23 ఘాట్లు ఏర్పాటు చేయగా... కేవలం రెండు ఘాట్లలోనే భక్తులు కొంతమేర కనిపిస్తున్నారు. కర్నూలు నగరంలోని సంకల్‌బాగ్, మంత్రాలయం ఘాట్లకు మాత్రమే... ఉదయం పూట భక్తులు ఓ మోస్తరుగా వస్తున్నారు. నదిలో నీరు లేకపోవడంతో.... భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కార్తిక సోమవారంరోజు నందవరం మండలంలోని గురజాల పుష్కరఘాట్‌లో భక్తులు కొంత కనిపించారు. నాగలదిన్నె,రాంపురం పుష్కర ఘాట్లు భక్తులు లేక వెలవెలబోయాయి.

కొవిడ్ భయంతో పుష్కరాలకు భక్తుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉండగా...విధుల్లో ఉన్న ఐదుగురి సిబ్బందికి పాజిటివ్ రావడం... మరింత కలకలం రేపుతోంది. సోమవారం.. ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్ సహా ముగ్గురు పోలీసులకు కొవిడ్ నిర్ధరణైంది. పూజారులు, హోంగార్డులు కరోనా బారిన పడుతున్నారు. సంకల్ బాగ్ పుష్కర ఘాట్‌లో సంధ్యవేళలో..... తుంగభద్ర నదికి ఇచ్చే పంచ హారతులకు.. మంచి స్పందన వస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.