Talibans released 210 prisoners in Afghanistan: ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. జైలులో ఉన్న 210 ఖైదీలను విడుదల చేసింది. జైలులో ఉన్న నేరస్తులను విడుదల చేయడంతో ఆప్ఘనిస్థాన్ ప్రజలు శాంతి భద్రతలకు మరింత ప్రమాదం పొంచి ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాలిబన్ల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఇటీవల తాలిబన్లను విమర్శించిదన్న కారణంతో ఓ సామాజిక కార్యకర్త ఫోన్ నంబర్‌ను పోర్న్ సైట్లలో పెట్టారు దుండగులు. దీంతో ఆమెకు ఫోన్ కాల్స్, మెసేజ్‌లు రావడం ప్రారంభమైంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత మహిళ.
ఇదీ చూడండి: జైలుపై మిలిటెంట్ల దాడి- 11 మంది మృతి, ఖైదీల పరార్