cabinet Meeting: ఉర్దూను రెండో భాషగా గుర్తిస్తూ చట్ట సవరణకు ఏపీ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ అధికార భాష చట్టం 1966 సవరణకు ఆమోదం తెలిపింది. మొత్తం 35 అజెండా అంశాలపై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించారు. విదేశీ మద్యం నియంత్రణ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తితిదేలా ప్రత్యేక ఆహ్వానితుల నియామకం కోసం హిందు ధార్మిక సంస్థల చట్ట సవరణకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం పోర్టుల నిర్మాణం కోసం 8వేల 741 కోట్ల రుణ సమీకరణకు.... ఏపీ మారిటైమ్ బోర్డుకు హామీ ఉండేందుకు మంత్రివర్గం ఆమోదించింది. దివాళా తీసిన చక్కెర కర్మాగారాల్లోని ఉద్యోగులకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ అంశానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులకు రూ.214 కోట్ల వ్యయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి మృతికి కేబినెట్ రెండు నిమిషాలు మౌనం పాటించింది.
ఇదీ చదవండి : Cinema ticket rates: సినిమా టికెట్ ధరలు పెంపు..