ETV Bharat / city

ప్రియుడితో ఏకాంతంగా ఉండగా చూశాడని.. తమ్ముడిని చంపిన అక్క! - dummy

ప్రియుడితో ఏకాంతంగా ఉండగా చూశాడని.. తమ్ముడిని చంపిన అక్క!

author img

By

Published : Oct 22, 2021, 10:32 AM IST

10:28 October 22

ప్రియుడితో ఏకాంతంగా ఉండగా చూశాడని.. తమ్ముడిని చంపిన అక్క!

మహారాష్ట్రలో దారుణం జరిగింది. తన ప్రియుడితో ఏకాంతంగా ఉండగా చూశాడని సొంత అక్కే తమ్ముడిని హత్య చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ యువతి ప్రేమ వ్యవహారం నడుపుతోంది. అయితే ఇటీవల ఇంట్లో కుటుంబసభ్యులు అందరూ బయటకు వెళ్లడంతో తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. అతడితో కలిసి ఏకాంతంగా గడుపుతుండగా.. అనుకోకుండా తమ్ముడు ఇంటికి వచ్చాడు.

ఊహించని ఈ పరిణామంతో కంగుతిన్న ఆ యువతి.. తమ వ్యవహారం బయటపడుతుందని ఆందోళనకు గురైంది. తన తమ్ముడిని అంతమొందించడమే ఇందుకు పరిష్కారమనుకుంది. ప్రియుడి సహకారంతో తమ్ముడి గొంతు పిసికి ప్రాణాలు తీసింది.

కుమారుడి మృతిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. దీంతో హత్యకు పాల్పడిన సదరు యువతి, ఆమె ప్రియుడిని అరెస్ట్​ చేశారు.

For All Latest Updates

TAGGED:

dummy
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.