ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ మన్యంలో డోలీ మోతలు ఆగడం లేదు. పాడేరు మండలం మినుములూరు పంచాయతీ గాలిపాడులో ఆరునెలల గర్భిణీ పురిటి నొప్పులతో విలవిల్లాడింది. రహదారి సక్రమంగా లేకపోవటంతో.. అంబులెన్స్ మార్గ మధ్యలోనే ఉండిపోయింది. రెండు కిలోమీటర్ల మేర డోలీలో కొండల గుండా మోసుకొచ్చి అంబులెన్స్‌పై మినుములూరు ఆసుపత్రికి తరలించారు. చివరకు బిడ్డ మృతి చెంది ఆమెకు అబార్షన్ అయింది. ఏజెన్సీలో గర్భిణీలు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల... ఇలాంటి ముందస్తు అబార్షన్లు అవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
ఇవీ చదవండి...'పేరులోనే స్వర్ణం.. జీవితాల్లో లేదు'