ETV Bharat / city

'ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్‌ యోజనను తెలంగాణ అమలు చేయడంలేదు' - తెలంగాణ పీఎం ఆవాస్ యోజనను అమలు చేయడం లేదు

తెలంగాణలో ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్‌ యోజనను అమలు చేయడం లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి తెలిపారు. మంగళవారం లోక్‌సభలో ఎంపీలు ఎ.రేవంత్‌రెడ్డి, అర్వింద్‌ అడిగిన వేర్వేరు ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు.

Prime Ministers Grameen Awas Yojana
ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్‌ యోజన
author img

By

Published : Jul 27, 2022, 11:50 AM IST

ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్‌ యోజనను తెలంగాణ అమలుచేయడం లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి తెలిపారు. మంగళవారం లోక్‌సభలో ఎంపీలు ఎ.రేవంత్‌రెడ్డి, అర్వింద్‌ అడిగిన వేర్వేరు ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. 2016-17, 2017-18ల్లో ఈ పథకం కింద తెలంగాణకు 70,674 ఇళ్లు కేటాయించి, తొలి విడత కింద 2016-17నాటి లక్ష్యాల పూర్తికోసం రూ.190.79 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలుచేయడం లేదన్నారు. అందుకే గత నాలుగేళ్లలో తెలంగాణకు కేంద్ర వాటా కింద ఎలాంటి నిధులూ మంజూరు చేయలేదని చెప్పారు.

పంటమార్పిడి కోసం తెలంగాణకు ఆరేళ్లలో రూ.1,647 కోట్లు.. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న జాతీయ ఆహారభద్రత మిషన్‌, సమీకృత ఉద్యానవన పంటల అభివృద్ధి, రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన కింద 2017-18 నుంచి 2022-23 మధ్య ఆరేళ్ల కాలంలో కేంద్రవాటా కింద తెలంగాణకు రూ.1,647.83 కోట్లు ఇచ్చినట్లు వ్యవసాయమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. ఆయన మంగళవారం తెరాస ఎంపీలు పసునూరి దయాకర్‌, రంజిత్‌రెడ్డి, మాలోతు కవిత, వెంకటేష్‌ నేతలు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.