ETV Bharat / city

ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. ఆన్​లైన్​ పోటీలకు అందరూ ఆహ్వానితులే! - శ్రీకృష్టాష్టమి వేడుకలు

sri krishna janmastami: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భారీ స్థాయిలో నిర్వహించేందుకు "ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్" సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలను ఆగస్టు 1 నుంచి 20 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 50 రకాల ఈవెంట్లు నిర్వహిస్తున్నామని.. ఆసక్తి గల వారు పాల్గొనవచ్చని నిర్వాహకులు కోరారు.

శ్రీకృష్ణ జన్మాష్టమి
శ్రీకృష్ణ జన్మాష్టమి
author img

By

Published : Jul 7, 2022, 4:49 PM IST

sri krishna janmastami: ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా కృష్ణాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏపీలోని నెల్లూరుకు చెందిన "ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్" వారు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి విశిష్ఠతను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేందుకు ఈ వేడుకలను ఆగస్టు 1 నుంచి 20 వరకు నిర్వహిస్తున్నామని సొసైటీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడు ఖండాల్లోని 80 దేశాలకు చెందిన ప్రజలు ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు.

ఈ వేడుకల్లో భాగంగా.. 50 కంటే ఎక్కువ ఈవెంట్లు నిర్వహిస్తున్నామని, ఇందులో 300 కంటే ఎక్కువ సబ్ కేటగీరిలు ఉన్నాయని చెప్పారు. ఈ పోటీలలో నాలుగు నెలల పిల్లల నుంచీ.. 80 ఏళ్ల వయసుకున్న వారి వరకు పాల్గొనవచ్చు. ఇందుకోసం ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలో పాల్గొనే వారు చేయాల్సిన పని ఏమంటే.. తమకు నచ్చిన ఏదైనా అంశంపై వీడియో రూపొందించి ఆన్​లైన్​ ద్వారా పంపించాలి.

krishnastami
ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎవరైనా, ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా తమకు నచ్చిన వీడియోను రూపొందించి పంపాలని నిర్వాహకులు కోరారు. వాటిని పరిశీలించి విజేతలను ప్రకటిస్తామని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే వారందరికీ సర్టిఫికేట్లు ప్రదానం చేస్తామని తెలిపారు. విజేతలకు సర్టిఫికెట్లతోపాటు బహుమతులు సైతం ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అదనపు వివరాల కోసం 8919717982, 9701839381 నంబర్లకు ఫోన్ చేయాలని..లేదా cmkdasa@gmail.com ద్వారా సంప్రదించాలని సూచించారు.

ఇదీ చదవండి: తెరాస సర్కార్‌పై పోరాటానికి భాజపా 'ఆర్​టీఐ' అస్త్రం..!

'మోదీ మా సేవల్ని గుర్తించారు'.. ఇళయరాజా, పీటీ ఉష హర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.