డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుపై 2017లో రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యవహారంలో అంతర్జాతీయ ముఠాల ప్రమేయం ఉన్నందున ఎక్సైజ్ సిట్ పరిధి సరిపోదని రేవంత్‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.
సీబీఐ, ఈడీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వంటి కేంద్ర సంస్థలకు ఈ కేసును అప్పగించాలని రేవంత్ పిటిషన్‌లో కోరారు. దర్యాప్తునకు ఈడీ, ఎన్సీబీ సిద్ధంగా ఉన్నాయని న్యాయవాది రచనారెడ్డి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈడీ, ఎన్‌సీబీకి రాష్ట్ర ప్రభుత్వం వివరాలు ఇవ్వడం లేదని వాదనలు వినిపించారు. దీనిపై స్పందంచిన ధర్మాసనం సిట్ దర్యాప్తు ఏ స్థితిలో ఉందో డిసెంబరు 10లోగా తెలపాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇవీచూడండి: డ్రగ్స్ తాయారీకి హైదరాబాద్ కేంద్రమైంది.. అందుకే!