ఏపీలో పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీకేజీ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వరుస ఘటనలు చోటు చేసుకోవటంపై విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు 42 మంది టీచర్లు అరెస్ట్ కాగా.. వారందరినీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఉద్దేశ్యపూర్వకంగా మాల్ ప్రాక్టీస్ వ్యవహరాలు జరుగుతున్నాయని విద్యాశాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. మాల్ ప్రాక్టీస్ వ్యవహారంపై మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ సిద్దమవుతోంది. ఉద్దేశ్యపూర్వకంగానే మాల్ ప్రాక్టీసుకు పాల్పడ్డారని రుజువైతే సర్వీస్ నుంచి తొలగించాలని యోచిస్తున్నారు.
ఇదీ చదవండి: రాహుల్ టూర్‌పై ముగిసిన విచారణ.. అభ్యంతరాలుంటే పిటిషన్ వేసుకోండి: హైకోర్టు
గుడ్‌న్యూస్.. భానుడి భగభగల నుంచి కాస్త రిలీఫ్.. మంగళవారమే మొదలు!