ETV Bharat / city

Incharge Ministers To Districts: 'రజినికి విశాఖ... రోజాకు ఎన్టీఆర్ జిల్లా' - Telangana News

Incharge Ministers To Districts: ఏపీలో కొత్త జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను ప్రభుత్వం నియమించింది. పలువురు మంత్రులకు సొంత జిల్లాలకు పక్కనున్న జిల్లాలకే ఇన్‌ఛార్జి మంత్రులుగా నియమించారు. ఆయా జిల్లాల్లో సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఈ ఇన్‌ఛార్జి మంత్రులు పర్యవేక్షించడంతో పాటు, సమీక్షిస్తారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో వెల్లడించారు.

Incharge Ministers
Incharge Ministers
author img

By

Published : Apr 20, 2022, 8:50 AM IST

Incharge Ministers To Districts: ఏపీలో జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను ప్రభుత్వం నియమించింది. 25 మంది మంత్రుల్లో గుడివాడ అమర్నాథ్‌కు మాత్రం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ ప్రాధాన్య జిల్లాగా ఉన్న విశాఖపట్నం బాధ్యతలను విడదల రజనికి అప్పగించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు ఇన్‌ఛార్జి మంత్రిగా వ్యవహరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అక్కడ నుంచి తప్పించి అనంతపురం జిల్లాకు పరిమితం చేశారు. ఆయన స్థానంలో కృష్ణా జిల్లా బాధ్యతలను ఆర్‌కే రోజాకు అప్పగించారు.

తానేటి వనితకు ఎన్టీఆర్‌ జిల్లా బాధ్యతను ఇచ్చారు. ప్రస్తుత మంత్రి కాకాణి, మాజీ మంత్రి అనిల్‌ మధ్య రాజకీయ వేడి రగులుతున్న నెల్లూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బాధ్యతలను అంబటి రాంబాబుకు అప్పగించారు. బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డితో పాటు పలువురు మంత్రులకు సొంత జిల్లాలకు పక్కనున్న జిల్లాలకే ఇన్‌ఛార్జి మంత్రులుగా నియమించారు. ఆయా జిల్లాల్లో సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఈ ఇన్‌ఛార్జి మంత్రులు పర్యవేక్షించడంతో పాటు, సమీక్షిస్తారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో వెల్లడించారు.

జిల్లాల వారీగా ఇన్‌ఛార్జి మంత్రుల వివరాలు..

శ్రీకాకుళం: బొత్స సత్యనారాయణ

విజయనగరం: బూడి ముత్యాలనాయుడు

అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం: గుడివాడ అమర్నాథ్‌

విశాఖపట్నం: విడదల రజని

అనకాపల్లి: పీడిక రాజన్న దొర

తూర్పుగోదావరి: చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

కాకినాడ: సీదిరి అప్పలరాజు

కోనసీమ: జోగి రమేష్‌

పశ్చిమగోదావరి: దాడిశెట్టి రామలింగేశ్వర రావు(రాజా)

ఏలూరు: పినిపె విశ్వరూప్‌, కృష్ణా: ఆర్‌కే రోజా

ఎన్టీఆర్‌: తానేటి వనిత

గుంటూరు: ధర్మాన ప్రసాదరావు

పల్నాడు: కారుమూరి వెంకట నాగేశ్వరరావు

బాపట్ల: కొట్టు సత్యనారాయణ

ప్రకాశం: మేరుగ నాగార్జున

నెల్లూరు: అంబటి రాంబాబు

వైఎస్సార్‌: ఆదిమూలపు సురేష్‌

అన్నమయ్య: కాకాణి గోవర్ధన్‌రెడ్డి

అనంతపురం: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సత్యసాయి: గుమ్మనూరు జయరాం

తిరుపతి: కె.నారాయణ స్వామి

చిత్తూరు: కేవీ ఉషశ్రీ చరణ్‌

నంద్యాల: అంజాద్‌ బాషా

కర్నూలు: బుగ్గన రాజేంద్రనాథ్‌

* కోనసీమ జిల్లాను అమలాపురం జిల్లాగా, ప్రకాశం జిల్లాను ఒంగోలు జిల్లాగా, వైఎస్సార్‌ జిల్లాలను కడప జిల్లాగా జీఓలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.