రాష్ట్రంలో వాక్సిన్ కొరత వెంటాడుతోంది. సరిపడినన్ని టీకాలు లేని కారణంగా రేపటినుంచి కేవలం రెండో డోసు మాత్రమే ఇవ్వాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ నెలాఖరు వరకు రెండో డోసు తీసుకోవాల్సిన వారు.. 11 లక్షల మంది ఉన్నారని వైద్యారోగ్య వర్గాలు వెల్లడించాయి. దీంతో మొదటి డోసు వాక్సినేషన్‌ను నిలిపివేసి.. కేవలం రెండో డోసు తీసుకునే వారికే టీకాను ఇవ్వాలని యోచిస్తోంది.
ఇప్పటికే కొవాక్సిన్, కొవిషీల్డ్ వయల్స్ అవసరానికి తగ్గ మోతాదులో రాకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మే 15వరకు మొదటి డోసు ఆపేయాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది.
ఇవీ చూడండి: 'గ్రామాలను చుట్టేస్తున్న వైరస్.. టీకానే మార్గం'