లేగదూడ మరణంతో ఓ గోమాత మూగ రోదన మాతృ ప్రేమకు అద్ధం పట్టింది. లారీ ఢీకొని ఆవు దూడ చనిపోయింది. ఇది చూసి తల్లడిల్లిన తల్లి ఆవు రోదన.. స్థానికులను కలచివేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కోడూరు విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. బిడ్డ మరణాన్ని జీర్ణించుకోలేని ఆ గోమాత.. గంటల తరబడి అక్కడే కూర్చుని లేగదూడను నిమురుతూ ఉండిపోయింది.
గోమాత బాధను చూడలేని స్థానికులు.. చనిపోయిన దూడను అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఆ తర్వాత గోవు మరింత విషణ్న వదనంతో కనిపించింది. రాత్రి వరకూ రహదారుల వెంట అరుస్తూనే తిరిగింది. బిడ్డ కోసం తల్లి ఆవు పడిన వేదన స్థానికులను కలచి వేసింది. తల్లి ప్రేమ గొప్పదనాన్ని చాటి చెప్పే ఘటన బహుశా ఇంతకంటే మరొకటి ఉండదేమో!
ఇవీ చూడండి..