ETV Bharat / city

Consumer Forum: ట్రావెల్ ఏజెన్సీకి వినియోగదారుల కమిషన్ షాక్​

ఓ ట్రావెల్ ఏజెన్సీ ఇచ్చిన ఆఫర్​ ప్రకారం తమకు డబ్బు తిరిగి ఇవ్వలేదని ఓ ప్రయాణికుడు వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కమిషన్​ ప్రయాణికుడికి ఆఫర్​ ప్రకారం డబ్బు చెల్లించడంతో పాటు వడ్డీ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇంతకి ఆ ఆఫర్​ ఏంటీ.. ఆ ట్రావెల్ ఏజెన్సీ ఏదో చూద్దాం పదండి.

Consumer Forum
వినియోగదారుల కమిషన్
author img

By

Published : Aug 22, 2021, 12:48 PM IST

హైదరాబాద్​లోని అల్వాల్​కు చెందిన హరీశ్​ భీమర్తి.. 2019లో విదేశాలకు వెళ్లేందుకు ప్రణాళిక వేసుకున్నారు. టికెట్ బుకింగ్ కోసం ఆన్​లైన్​లో వెతుకుతుండగా.. 'మేక్ మై ట్రిప్'(makemytrip.com) డాట్ కామ్​లో ఓ ఆఫర్ ఆకర్షించింది. అతి తక్కువ ధరకే టికెట్ అమ్ముతామని ఆ ఆఫర్ సారాంశం. టికెట్ కొనుగోలు చేసిన 24 గంటల్లో అంతకన్నా తక్కువ ధరకే ఇతర ఆన్​లైన్ ట్రావెల్ ఏజెన్సీలు అమ్మితే.. తమకు చెల్లించిన సొమ్ముకు ఐదింతలు.. గరిష్ఠంగా రూ.10వేలు వ్యాలెట్​లో జమ చేస్తామని ఆఫర్ ఇచ్చింది. ఆఫర్ నచ్చడంతో హరీష్ 2019 సెప్టెంబరు 6న నాలుగు అంతర్జాతీయ టికెట్లు కొనుగోలు చేశారు. హైదరాబాద్ నుంచి కౌలలంపూర్​కు.. అక్కడి నుంచి డెన్పసర్​కు... మళ్లీ డెన్పసర్ నుంచి కౌలలంపూర్​కు.. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేలా టికెట్లు కొన్నారు.

అంతకన్నా తక్కువకే ఇతర ఏజెన్సీల్లో టికెట్లు..

టికెట్లు కొనుగోలు చేసిన తర్వాత ఇతర ఆన్​లైన్ ట్రావెల్ ఏజెన్సీలను పరిశీలించారు. క్లియర్ ట్రిప్, ఈజీ మైట్రిప్​లో అంతకన్నా రూ.6వేలు తక్కువకే అమ్ముతున్నట్లు గుర్తించారు. వెంటనే స్క్రీన్ షాట్లు తీసి.. మేక్ మై ట్రిప్​కు మెయిల్ చేశారు. బెస్ట్ ప్రైస్ గ్యారంటీ స్కీం ప్రకారం ఒక్కో టికెట్ కు రూ.10 వేల రూపాయలు చెల్లించాలని కోరారు. మేక్ మై ట్రిప్ నుంచి స్పందన లేకపోవడంతో హైదరాబాద్ జిల్లా రెండో వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించారు. ఒక్కో టికెట్ కు రూ.10 వేలను 12 శాతం వార్షిక వడ్డీతో చెల్లించడంతో పాటు.. మానసిక వేదన కలిగించినందుకు రూ.3 లక్షలు.. ఖర్చుల కింద రూ.20వేలు చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరారు.

ఆఫర్ అందరికీ వర్తించదు.. షరతులు ఉన్నాయి

హరీశ్​ పిటిషన్​పై హైదరాబాద్ జిల్లా రెండో వినియోగదారుల కమిషన్ ప్రెసిడెంట్ వక్కంటి నరసింహారావు, పీవీటీఆర్ జవహర్ బాబు, ఆర్ఎస్ రాజశ్రీలతో కూడిన బెంచ్ విచారణ జరిపింది. బెస్ట్ ప్రైస్ గ్యారంటీ స్కీం షరతులకు లోబడి ఉంటుందని.. అందరికీ వర్తించదని మేక్ మై ట్రిప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వినియోగదారుల కమిషన్​కు వివరణ ఇచ్చింది. డీల్ కోడ్, వోచర్, కార్పొరేట్ డిస్కౌంట్ వంటివి ఉపయోగిస్తే... రీఫండ్​కు అర్హులు కాదని తెలిపింది. తమ వద్ద టికెట్ బుక్ చేసిన ప్రయాణాలకు.. హరీశ్​ పేర్కొన్న ఇతర ఆన్​లైన్ ట్రావెల్ ఏజెన్సీలోని ప్రయాణాలు షరతులు ఒకేవిధంగా లేవని పేర్కొంది.

సొమ్ము తిరిగి ఇవ్వాల్సిందే

టికెట్ కొన్న 24 గంటల్లోనే ప్రయాణికుడు... ఇతర ఏజెన్సీల్లో తక్కువ ధరల వివరాలను స్క్రీన్ షాట్ల రూపంలో ఆధారాలు పంపించినప్పటికీ.. చిన్నచిన్న కారణాలతో డబ్బు ఇవ్వకపోవడాన్ని హైదరాబాద్ జిల్లా రెండో వినియోగదారుల కమిషన్ తప్పుపట్టింది. బైస్ట్ ప్రైస్ గ్యారంటీ స్కీం ప్రకారం అదనపు సొమ్ముకు తిరిగి పొందేందుకు ఆ ప్రయాణికుడు అర్హుడేనని స్పష్టం చేసింది. ప్రయాణాలు ఒకేవిధంగా లేవనేందుకు మేక్ మై ట్రిప్ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని పేర్కొంది. కాబట్టి హరీశ్​కు ఒక్కో టికెట్​కు రూ.6వేల చొప్పున రూ.24వేలు 9శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలని మేక్ మై ట్రిప్​ను ఆదేశిస్తూ వినియోగదారుల కమిషన్ ఇటీవల తీర్పు వెల్లడించింది. మానసిక వేదన కలిగించినందుకు రూ.15వేలు.. ఖర్చుల కింద మరో రూ.5 వేలను 45 రోజుల్లో చెల్లించాలని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: JEE MAIN Admit Cards: జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.